Nominated Posts: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే నెలలోనే నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తి చేయాలని టీపీసీసీ కసరత్తు చేస్తుంది.గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన కసరత్తు పూర్తి చేశారు. ఇందుకోసం ఆశావహుల నుంచి ప్రత్యేక లిస్టు తయారు చేశారు. ఆ జాబితాను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమోదించినట్లు తెలిసింది. దీంతో మే నెలలోనే పార్టీ ,ప్రభుత్వ పదవులు భర్తీ, జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా కొత్త టీపీసీసీ ముందుకు సాగుతుంది. పార్టీ కోసం శ్రమించిన నాయకులకు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రానున్నదని టీ పీసీసీ వర్గం తెలిపింది.
ఇక జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమర్థులైన నేతలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఇవ్వగా, మరి కొన్నింటికీ త్వరలోనే బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో పాటు గ్రామ స్థాయి వరకు కేడర్‌ను యాక్టివేట్ చేసేలా మండల కమిటీలు, బీఎల్ ఏ నియామకాలు మే చివరి నాటికి పూర్తి కానున్నాయి. ప్రభుత్వంలోని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ,ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా మహిళలకు ఈసారి పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 20 శాతం పైగా పదవులను మహిళా నేతలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్స్‌తో పాటు యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ వంటి అనుబంధ సంఘాల్లోకి కూడా కొత్త నాయకులకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది.
Also Read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కౌన్సిలర్ కారుకు బోర్డును కట్ చేసిన పోలీసులు
పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవులను ఒకేసారి భర్తీ చేయాలని టీపీసీసీ ముందుకు సాగుతుంది. అంతేగాక ఉమ్మడి జిల్లాల వారీగా కాకుండా, కొత్త జిల్లాల ప్రాతిపదికన పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.దీని వలన తెలంగాణలో త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్టీ భావిస్తుంది. మరోవైపు సామాజిక న్యాయం పాటిస్తూనే, బలమైన నేతలకూ ప్రాధాన్యత కల్పించే దిశగా పార్టీ అడుగులు వేస్తున్నది. ఇక మే నెలలో జరగబోయే ఈ నియామకాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం రానుంది. పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు ఊరట కలగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ వ్యూహంతో అటు పరిపాలన, ఇటు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేగంగా పడనున్నాయి.
Also Read: ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేసిన కేసీఆర్! సమ్మె నేపథ్యంలో నాటి చేదు అనుభవాల యాది…