E-Paper
Advertisement

చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!
Advertisement

Telangana Forts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని చారిత్రక సంపదకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. శిథిలావస్థకు చేరుతున్న కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు వారసత్వాన్ని కాపాడటంతో పాటు, ఇటు రాబడిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో 11 కోటలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన కోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తుంది.

11 ప్రధాన కోటలను..

తెలంగాణ గడ్డ పై వీరత్వానికి, శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలుగా నిలిచిన కోటలు త్వరలోనే పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. రాష్ట్రంలోని భువనగిరి, దేవరకొండ, రాచకొండ, మెదక్, ఖమ్మం,కౌలాస్ పోర్టు, జాఫర్ ఘడ్, ఎల్గందుల, రామగిరి, ఉట్నూరు, సర్వాయిపాపన్న పోర్టు ఈ 11 ప్రధాన కోటలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. పర్యాటక రంగంలో తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. కోటలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. దీనివల్ల అటు చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు ఉపాధి లభించనుంది.

ఒక ప్రత్యేక చరిత్ర..

Advertisement

ప్రభుత్వం గుర్తించిన కోటల్లో ప్రతి దానికీ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. భువనగిరి కోట: ఏకశిలా పర్వతంపై ఉన్న ఈ కోట అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్. దేవరకొండ కోట: రేచెర్ల పద్మనాయకుల వైభవానికి నిదర్శనం.రాచకొండ కోట: వ్యూహాత్మక రక్షణ కట్టడాలకు పెట్టింది పేరు. మెదక్ కోట: కాకతీయుల కాలం నాటి అద్భుత నిర్మాణం. ఖమ్మం కోట: హిందూ, ముస్లిం వాస్తు శైలుల కలయిక. కౌలాస్ పోర్టు (కామారెడ్డి): పశ్చిమ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన కోట. జాఫర్ ఘడ్ (జనగామ): కొండల మధ్య దాగి ఉన్న చారిత్రక రహస్యం. ఎల్గందుల కోట (కరీంనగర్): మానేరు నది తీరాన ఉన్న అందమైన కోట.రామగిరి ఖిల్లా (పెద్దపల్లి): ప్రకృతి ఒడిలో ఉన్న ఆయుర్వేద మూలికల గని.ఉట్నూరు కోట (ఆదిలాబాద్): గిరిజన సంస్కృతి, చరిత్రకు చిహ్నం. సర్వాయి పాపన్న కోట (ఖిలాషాపూర్): బహుజన వీరుడు సర్వాయి పాపన్న నిర్మించిన కోట.

Also read: ఒడిశాలో అరాచకం.. బైక్‌పై వెళ్తూనే మహిళ జుట్టు పట్టుకుని పిడిగుద్దులు.. వీడియో వైరల్!

పురావస్తు శాఖ పర్యవేక్షణలో..

Advertisement

ఈ 11కోటలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేటు సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు త్రిబుల్ పీ మోడల్ (పబ్లిక్-ప్రైవేటు- పార్టనర్ షిప్) విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుంది. అందుకు త్వరలోనే నోటిఫికేషన్ వేయనున్నట్లు సమాచారం. పురావస్తు శాఖ పర్యవేక్షణలో చారిత్రక కట్టడాల మూలరూపం దెబ్బతినకుండా పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కోటల వద్ద రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీరు, రెస్టారెంట్లు, సౌండ్ అండ్ లైట్ షోలు, రిసార్టుల ఏర్పాటు ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే టిక్కెట్లు, హోటళ్లు, గైడ్ల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి చేస్తే విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించేలా హెరిటేజ్ వాక్స్, కల్చరల్ ఈవెంట్లను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేవలం సందర్శనకే పరిమితం కాకుండా, పర్యాటకులు అక్కడ ఎక్కువ సమయం గడిపేలా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

దేశంలోనే అగ్రస్థానం..

అడ్వెంచర్ టూరిజంలో భాగంగా భువనగిరి వంటి ఏకశిలా పర్వతాలపై రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్ సౌకర్యాలు ఉన్నాయి.అయితే కోటల సమీపంలో రాజసం ఉట్టిపడేలా విలాసవంతమైన బస ఏర్పాటు సైతం ఈ త్రిబుల్ పీ మోడల్ తో నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అదే విధంగా కోటల చరిత్రను వివరించేందుకు మల్టీమీడియా ప్రజెంటేషన్లు, ఆడియో గైడ్స్ సైతం ప్రదర్శించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలైతే, మన వారసత్వ సంపద భావి తరాలకు అందడమే కాకుండా, తెలంగాణ పర్యాటక రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలువనుంది. అదే విధంగా ఆదాయం, ఉద్యోగ కల్పన రెండు ప్రధాన లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తుంది. ఏది ఏమైనా కోటలకు మాత్రం మహర్దశ రాబోతుంది.

Also read: రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్..!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×