Earthquake in Telangana: తెలంగాణలో మరోసారి భూకంపం సృష్టించింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూప్రకంపనలు రావడంతో.. ఇళ్లలోంచి జనాలు బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదు అయింది.
గత మూడురోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు జనాన్ని భయపెట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు షాక్ లో ఉండిపోయారు. అయితే ములుగు జిల్లా మేడారంలో భూకంపకేంద్రం ఏర్పడగా.. దాని ఎఫెక్ట్ 230 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు విస్తరించింది.
హైదరాబాద్ కు దగ్గర్లో వచ్చిన భూ కంపాల వివరాలను చూస్తే.. గడచిన కొన్నేళ్లలో వచ్చిన భారీ భూకంపాల్లో లాతూర్ ఘటన ఒక్కటే అతి పెద్దది. ఆ తర్వాత వచ్చిన భూకంపాల తీవ్రత 5. 0 లోపే ఉండేది. కానీ, ప్రస్తుత భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదయ్యి.. ఈ ప్రాంత వాసులను భయకంపితులను చేసింది.
హైదరాబాద్ కి 300 కిలో మీటర్ల లోపల.. గత పదేళ్లలో మొత్తం 12 భూకంపాలు రాగా.. వీటిలో నాలుగుకి అటు ఇటు తీవ్రత మాత్రమే నమోదయ్యింది. 2020 ఏప్రిల్ 24 ఆసిఫాబాద్‌లో 4.8 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. దీని తర్వాత అంటే, 2024 మార్చి21న మహారాష్ట్రలోని బాస్మత్‌లో 4.6 తీవ్రతో మరో భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు 4 పైగా తీవ్రతో వచ్చిన భూకంపాలేంటనిచూస్తే.. వీటిలో 2024, డిసెంబర్ 4న ములుగులో నమోదైన భూకంప తీవ్రత 5. 3 కాగా. ఇదే అత్యధికం. 2021 అక్టోబర్ 23న రామగుండం, 2021 జూలై 26న నందికొట్కూరు, 2020 జూన్ 5న బేతంచెర్లలో 4. 0 తీవ్రతతో సంభవించిన భూకంపాలు అత్యల్ప తీవ్రత కలిగినవిగా నమోదయ్యాయి.
Also Read: కాళ్ల కింద కదులుతోన్న భూమి.. గోదావరి తీరంలోనే ఎందుకు? 55 ఏళ్ల కిందట ఇక్కడ భూకంప తీవ్రత ఎంత?
కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి ఈ భూకంపాలున్నాయని.. ఎర్త్ ప్లేట్ లు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ భూకంపాలు వస్తాయని అంటున్నారు సైంటిస్టులు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే 53 ఏళ్ల క్రితం భద్రాచలంలోనూ భూకంపం సంభవించిందని. ప్రస్తుతం ములుగులో వచ్చిన భూకంపానికి కారణం.. ఈ ప్రాంతంలో గోదావరి నది పరివాహక ఒత్తిడి అధికం కావడం వల్లేనని అంటున్నారు. యాభై ఏళ్లకు ఒకసారి భూమి పొరల్లోని సర్దుబాట్ల కారణంగా.. ఇలాంటి సంఘటనలు సంభవిస్తుంటాయని అన్నారు ఏయూ ప్రొ. కరీమున్నీసా.
ఏపీ, తెలంగాణకు 4 నుంచి 5 వరకూ తీవ్రత వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నాయని తేల్చేశారు నిపుణులు. విశాఖ, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలు.. జోన్ 3లో ఉన్నాయి కాబట్టి. అంత భారీ భూకంపాలు వచ్చే అవకాశాల్లేవు అంటున్నారు. దీనిపై పెద్దగా ఆందోళన చెందాలన అంశం కాదని చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, ఇవి సర్వసాధారణం అని పేర్కొంటున్నారు నిపుణులు.