E-Paper
Advertisement

IPL 2025: RCB లో ప్రకంపనలు..ఆ ప్లేయర్‌ రిటైర్మెంట్‌.. ఒంటరైన విరాట్‌ కోహ్లీ ?

IPL 2025: RCB లో ప్రకంపనలు..ఆ ప్లేయర్‌ రిటైర్మెంట్‌.. ఒంటరైన విరాట్‌ కోహ్లీ ?
Advertisement

 

IPL 2025: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 టోర్నమెంట్‌  (2025 Indian Premier League ) నేపథ్యంలో బెంగళూరు పరిస్థితి దారుణంగా తయారైంది. ఫినిషర్ దినేష్ కార్తీక్ గత సంవత్సరంలో ఐపీఎల్  కు (2025 Indian Premier League )  వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సిబి ఓడిపోవడంతో కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. ఎంతో బాధతో డీకే ఆర్సిబిని వదిలేశాడు. మ్యాచ్ అనంతరం ఆర్సిబి ఆటగాళ్లు డీకేకి గార్డ్ ఆఫ్ హానర్ ని ఇచ్చి సత్కరించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే డీకే అధికారికంగా తన రిటైర్మెంట్ విషయాన్ని అనౌన్స్ చేశాడు.

Advertisement

Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!

నిజానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న సమయంలో ఐపీఎల్ ట్రోఫీని ( Indian Premier League ) ముద్దాడాలని కార్తీక్ ఎంతో ఆశపడ్డాడు. కానీ అతని కలలు నెరవేరలేదు. ఇప్పుడు వచ్చే సీజన్లో కార్తీక్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డీకేని కొహ్లీ చాలా మిస్ అవుతాడు. ఎందుకంటే కార్తీక్ అత్యంత నమ్మకమైన ఫినిషర్. చాలాసార్లు జట్టును క్లిష్ట పరిస్థితులలో కాపాడాడు. చివరి ఓవర్ లో డీకే క్రీజులో ఉన్న సమయంలో కోహ్లీ ధైర్యంగా కనిపించేవాడు.

Advertisement

గత ఐపిఎల్ సీజన్లో డీకే వెళ్తూ వెళ్తూ మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సిబి, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొత్తం 549 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఇది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 287 పరుగులు చేసింది. కానీ ఆ మ్యాచ్లో ఆర్సిబి విజయం సాధించినప్పటికీ దినేష్ కార్తీక్ వీర విహారం చేసి కొద్దిసేపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓటమి భయాన్ని కల్పించాడు. కేవలం 34 బంతుల్లోనే 7 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు స్టేడియం మొత్తం దినేష్ నామస్మరణతో మార్మోగిపోతుంది.

Also Read: ICC Champions Trophy 2025: తిక్క కుదిర్చిన ఐసీసీ…ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ అక్కడే ?

ఇలాంటి ఫినిషర్ లేకపోవడంతో ఆర్సిబికి తీరని లోటు గానే మిగిలిపోతుంది. 2008 నుంచి 2024 వరకు మొత్తం 17 సీజన్లు ఆడిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ ఒకరు. అతడు తన కెరీర్ లో ఆరు వేర్వేరు జట్లకు ఆడాడు. కానీ తన ఐపీఎల్ కెరియర్ మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మొదలైంది. దినేష్ కెరీర్ లో ముంబై ఇండియన్స్
( Mumbai Indians) , పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, ఆర్సిబి తర ఫున ఆడాడు. కోల్కత్తా కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో 257 మ్యాచ్లలో 4,842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోర్ 97. ఏది ఏమైనప్పటికి దినేష్ కార్తీక్ అందించిన సహ కారాన్ని, పోరాటాన్ని ఆర్సిబి ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది.

Related News

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

Big Stories

Advertisement
×