Train Travel: భారతీయ రైల్వే సంస్థ నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి ఉన్న భారత్, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. సుమారు 13 వేల రైళ్ల ద్వారా ప్రయాణీకులను రోజూ తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. అయితే, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా.. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదు.
రైలు బోగీలో చేయకూడని పనులు
⦿ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడకండి
రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడకూడదు. స్పీకర్ ఆన్ చేసి గట్టి గట్టిగా మాట్లాడ్డం వల్ల తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు పక్కవారికి ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా మాట్లాడాలి.
⦿ సౌండ్ ఎక్కువగా పెట్టి పాటలు వినకూడదు
కొన్నిసార్లు కొంత మంది ప్రయాణీకులు ఫోన్ లో పెద్దగా సౌండ్ పెట్టి పాటలు వింటుంటారు. అలా చేయడం వల్ల ఇతరులకు చిరాకు కలుగుతుంది. అందుకే వీలైనంత వరకు ఇయర్ ఫోన్స్ ధరించి పాటలు వినడం మంచిది.
⦿ ఎదటి సీట్ల మీద కాళ్లు పెట్టకూడదు
రైల్వే ప్రయాణంలో సాధారణంగా ఎదుటి సీట్ల మీద కాళ్లు పెడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా పెట్టకూడదు. కాళ్లకు ఉన్న మురికి సీట్లకు అంటుకోవడం వల్ల ఇతర ప్రయాణీకులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
⦿ బ్యాగులు సీట్లపై ఉంచకూడదు
రైల్వే ప్రయాణ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ లగేజీ బ్యాగులు సీట్ల మీద పెట్టకూడదు. మీకు కేటాయించిన ప్రదేశంలో భద్రంగా పెట్టుకోవాలి. సీట్ల మీద లగేజీ పెట్టడం వల్ల తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
⦿ ఆరెంజ్ లాంటి పండ్లు తినకూడదు
రైల్లో ప్రయాణించే సమయంలో ఆరెంజ్ లాంట ఎక్కువ వాసన వచ్చే పండ్లు తినకపోవడం మంచింది. ఈ స్మెల్ ఒక్కోసారి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.
Read Also: స్పీడు పెంచిన వందే భారత్.. ఈ రూట్లో మరింత వేగంగా గమ్యానికి, ఎంత టైమ్ తగ్గుతుందంటే..
⦿ పెంపుడు జంతువులతో జాగ్రత్త
రైల్లో పెట్స్ తీసుకెళ్లే అవకాశం ఉన్ననా, ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బొచ్చు కుక్కల వెంట్రులకు ఇతర ప్రయాణీకులకు చిరాకు కలిగించే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు వాటిన మీ దగ్గరే ఉండేలా చూసుకోవాలి.
⦿ క్యూ పద్దతి పాటించండి
రైల్లోకి ఎక్కే సమయంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా క్యూ పద్దతిని పాటించాలి. అంతకంటే ముందు రైల్లోని ప్రయాణీకులు దిగే వరకు ఆగాలి. అందరూ దిగిన తర్వాతే మీరు లోపలికి ఎక్కాలి. ఎలాంటి తోపులాటకు తావులేకుండా నెమ్మదిగా రైల్లోకి ఎక్కడం మంచిది.
⦿ రాత్రిపూట లైట్లు వేయకూడదు
రైల్వే రూల్స్ ప్రకారం రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ బోగీలో లైట్లు వేయకూదు. రాత్రి 10 తర్వాత కోచ్ లోని మెయిన్ లైట్లు ఆఫ్ చేసి, చిన్న లైట్లను ఆన్ చేసుకోవాలి.
Read Also: బాబోయ్.. అన్ని కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారా? అసలు విషయం చెప్పిన రైల్వేమంత్రి!