E-Paper
Advertisement

కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు.. రైతుల పట్ల బాధ్యత లేదా? ఎంపీ చామల నిలదీత

కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు.. రైతుల పట్ల బాధ్యత లేదా? ఎంపీ చామల నిలదీత
Advertisement

Chamala Kiran Kumar Reddy: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీల్ ఆధ్వర్యంలో దిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నితిన్ నబీన్ కు తెలంగాణపై ఏ మాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వల్లే ఏర్పడిందని చామల గుర్తుచేశారు. ఈ విషయాన్ని గూగుల్ లో ఎవరు వెతికినా తెలుస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు దిల్లీ వేదికగా బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నాడు ఏపీ నుంచి 25 మంది ఎంపీ ఉంటే.. తెలంగాణ నుంచి 12 మందే ఉన్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణను సాధించామని చామల పేర్కొన్నారు.

Advertisement

అటు తెలంగాణ వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఊహించలేదని భువనగిరి ఎంపీ అన్నారు. టైం పాస్ రాజకీయాలు మాత్రమే చేయాలని ఆనాడు కేసీఆర్ అనుకున్నారని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను కేసీఆర్ దోచుకుంటే కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనే పరిస్థితి కేంద్రం వద్ద ఎందుకు లేదని నిలదీశారు.

తెలంగాణలో 38 శాతం ధాన్యాన్ని మాత్రమే కేంద్రం ఎందుకు కొన్నదో చెప్పాలని తెలంగాణ బీజేపీ నేతలను ఎంపీ చామల ప్రశ్నించారు. తెలంగాణ వారు రైతులు కారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు తెలంగాణ రైతుల పట్ల బాధ్యత లేదా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్ మెంట్ అడిగితే బీజేపీ నేతలు ఎందుకు ఇప్పించడం లేదని మండిపడ్డారు. కనీసం మీరైనా మహారాష్ట్ర సీఎంతో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

Advertisement

Also Read: రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

తెలంగాణ ఆవీర్భావం రోజున ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ నేతలు మాట్లాడారని చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు మెట్రో ఫెజ్ – 2కు కేంద్రం నిధులు 15 శాతం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమిళనాడులో మెట్రోకు కేంద్రం 60 శాతం నిధులు ఇచ్చింది నిజం కాదా? అని అన్నారు. మరోవైపు మూసీ ప్రక్షాళనకు సైతం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. అభివృద్ధి జరకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ బాగుపడవద్దా? అని ప్రశ్నించారు.

Also Read: మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

Related News

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

Big Stories

Advertisement
×