E-Paper
Advertisement

Vijaya Dairy: డేంజర్ బెల్స్.. తెలంగాణ బ్రాండ్ పేరుతో ఏపీ కల్తీ పాలు, నెయ్యి అమ్మకం

Vijaya Dairy: డేంజర్ బెల్స్.. తెలంగాణ బ్రాండ్ పేరుతో ఏపీ కల్తీ పాలు, నెయ్యి అమ్మకం
Advertisement

Vijaya Dairy: స్వేచ్ఛ బ్యూరో: మా రాష్ట్ర డెయిరి రైతులకు నష్టం జరిగితే ఊరుకోబోమని విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లోని విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కృష్ణ యూనియన్.. విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో కల్తీ పాలు నెయ్యి అమ్ముతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజ్ ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీపాలు, నెయ్యి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మారిన తరువాత ఏపీ విజయ బ్రాండ్ ను మిస్ యూస్ చేస్తోందని మండిపడ్డారు.

గుజరాత్‌లో నెయ్యి..

ఏపీ డైరీ ప్రభుత్వం రంగ సంస్థ కానీ ప్రైవేట్ వ్యవక్తుల చేతుల్లో పెట్టారు. ఏపీ ప్రభుత్వం దీని పై దృష్టి పెట్టాలని కోరారు. మేఘానా ఫుడ్స్ కు ఫ్రాంచైజ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం వాళ్ళు గుజరాత్ లో నెయ్యి తయారు చేసి తెలంగాణ అమ్ముతున్నారని, ఆ నెయ్యిలో వేజిటేబుల్ ఆయిల్ ఉన్నట్లు ఎన్‌డిడిబి రిపోర్ట్ ఇచ్చిందని, హైదరాబాద్‌లో ప్రతి నెల 100 టన్నుల నెయ్యి అమ్మకం జరుగుతుందని, కల్తీ పాలు, నెయ్యితో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: iPhone EMI Risk: రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ ఈఎంఐలో కొంటున్నారా? ఆర్థికంగా భారీ నష్టమే ఎందుకంటే

నిబంధనల ప్రకారం

నెల్లూరు, కర్నూల్ యునియన్ లకు చెప్తే విజయ బ్రాండ్ ఉపయోగించడ ఆపేసారని, దీనితో తెలంగాణపాడి రైతాంగానికి నష్టం జరుగుతుందని, పాలప్యాకెట్ మీద డీటెయిల్స్ స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీ డీటెల్స్ వస్తున్నాయని, ఆ సంస్థను ప్రశ్నిస్తే.. తాము అమ్మట్లేదని చెప్తున్నారన్నారు. డైరి ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు విజయ డైరీ పేరు వాడుకోవడానికి లేదఅని స్పష్టం చేశారు. ఎన్నోసార్లు ఏపీ డైరీకి లేటర్స్ రాసాం కానీ స్పందన లేదన్నారు. మా రాష్ట్ర డైరీ రైతులకు నష్టం జరిగితే ఊరుకోం.. మాపాడి రైతులకు అండగా ఉంటాం. కల్తీ పాలు, నెయ్యి మీద రోజు ఏపీ అసెంబ్లీలో రచ్చ అవుతోంది..ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.తెలంగాణ ప్రజలు విజయ పేరును చూసి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: Computer Shortage: మూడు కార్పొరేషన్లు సరే.. మరి ఈ పనులు ఎవరు చేయాలి..?

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×