BigTV English

Noida Dowry Case: వరకట్న వేధింపులతో భార్య.. పోలీస్ ఎన్ కౌంటర్‌లో భర్త.. అసలు ఏం జరిగిందంటే..?

Noida Dowry Case: వరకట్న వేధింపులతో భార్య.. పోలీస్ ఎన్ కౌంటర్‌లో భర్త.. అసలు ఏం జరిగిందంటే..?

Noida Dowry Case: అదనపు కట్నం కోసం మహిళలకు వేధింపులు, చిత్రహింసలు ఆగడం లేదు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను.. ఓ భర్త అతికిరాతంగా చంపిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. పెట్రోల్‌ పోసి భర్త, అత్తింటి వారు హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఒక్కసారి ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం.. గ్రేటర్ నోయిడాలోని సిర్సా ప్రాంతానికి చెందిన విపిన్ భాటితో నిక్కీ అనే యువతికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. లక్షల నగదుతో పాటు స్కార్పియో కారు, విలువైన వస్తువులు కట్న కానుకలుగా ఇచ్చారు. రిసెంట్‌గా బాధితురాలి తండ్రి భికారీ సింగ్‌ ఓ బెంజ్‌ కారు కొన్నాడు. అయితే తనకూ అలాంటి మరో కారైనా లేకపోతే…36 లక్షల అదనపు కట్నం కావాల్సిందేనని నిక్కీని విపిన్‌ కొద్దిరోజులుగా ఫోర్స్ చేస్తూ వచ్చాడు.


కట్నం తేలేదని భార్యకు నిప్పంటించి హత్య
ఇదే క్రమంలో గురువారం రాత్రి నిక్కీని ఆమె భర్త, అత్తమామలు చిత్ర హింసలు పెట్టారు. అదనపు కట్నం తేస్తావా చస్తావా అంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే నిక్కీపై దాడి చేసి, జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చాడు. అంతటితో ఆగకుండా.. ఆమెపై థిన్నర్‌ చల్లి నిప్పంటించారు. ఈ దారుణమంతా ఆమె ఆరేళ్ల కుమారుడు, అదే ఇంట్లో ఉంటున్న ఆమె సోదరి కళ్ల ముందే జరిగింది.

హత్య వీడియో వైరల్‌
70% కాలిన గాయాలవ్వడంతో.. అక్కడి నుంచి సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే నిక్కీ చనిపోయింది. బాధిత మహిళకు నిప్పు పెట్టిన వీడియో, నిక్కీ కుమారుడు, సోదరి ఇచ్చిన సాక్షాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో బాధిత మహిళను నిందితుడు విపిన్ భాటి, అతని తల్లి జట్టుపట్టుకొని లాగడం, తరువాత నిప్పు పెట్టడం, బాధిత మహిళ మంటల్లో కాలిపోతూ మెట్ల మీద నుంచి కిందకు వస్తూ కుప్పకూలిపోవడం లాంటి దారుణ దృశ్యాలు ఉన్నాయి.


జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి.. థిన్నర్‌ చల్లి నిప్పంటించిన భర్త, అత్తమామలు
బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. దారుణాన్ని బాధితురాలి ఆరుగేళ్ల కుమారుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. తన తండ్రే తల్లిని చంపేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. బాలుడు తన తల్లి పైకి ఏదో ద్రవం పోసి, ఆ తరువాత చెంపపై కొట్టి, చివరికి లైటర్‌తో కాల్చేశాడని తెలిపాడు. మేరీ మమ్మీ కే ఉపర్ కుఛ్ దాలా, ఫిర చాంటా మారా ఫిర లైటర్ సే ఆగ్ లగా దీ, అంటూ చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టించాయి.

Also Read: బీఆర్ఎస్‌కు సవాలుగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలు..

నిందితుడిపై పోలీసుల కాల్పులు
కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో నింధితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నింధితుడు పోలీసుల చేతిలో నుంచి గన్ లాక్కోడానికి ప్రయత్నించడంలో విపిన్‌ను పోలీసులు హెచ్చరించారు. అయిన కూడా పోలీసుల వ్యాన్‌లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు.. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు గాయలపాలైన విపిన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు.. అలాగే వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే విపిన్ తన భార్యను అతి కిరాతంగా చంపినందుకు తగిన శిక్ష పడాలి అని నేటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

BJP New Chief: బీజేపీ కొత్త అధ్యక్షులెవరు? ఈసారి ఉత్తరాదికే ఛాన్స్

Rahul-Tejaswi Yadav: పెళ్లి గురించి ఆసక్తికర సంభాషణ.. రాహుల్‌-తేజస్వియాదవ్, మేటరేంటి?

Rahul Gandhi Yatra: రాహుల్ యాత్రలో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్!

Wedding Invitation Fraud: వాట్సాప్‌లో పెళ్లి ఇన్విటేషన్‌ లింక్.. ఒకే క్లిక్‌తో రూ.1.90 లక్షలు మాయం

Singapore: తండ్రిని పట్టించిన బాలుడు.. సింగపూర్‌లో భారతీయుడికి జైలు, అసలే మేటరేంటి?

Big Stories

×