Revanth Govt: బీసీలకు శుభవార్త చెప్పింది రేవంత్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు రేవంత్ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఆయా రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరిగింది. సుమారు 4 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది. తెలంగాణలో సగం జనాభాకు పైగానే బీసీలు ఉన్నారు. వారికి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించే రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై నెలాఖరులోపు రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
ఈ అంశంపై చర్చించింది మంత్రివర్గం. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రేవంత్ ప్రభుత్వం బీసీ డెడికేటేడ్ కమిషన్‌ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కుల గణన చేపట్టింది. దీని ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించింది.
ALSO READ: 14న తిరుమలగిరిలో సీఎం భారీ బహిరంగ సభ
బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ, మండలం, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణిస్తారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణలకు ఆమోదం తెలిపింది మంత్రి వర్గం. త్వరలో ఈ చట్టానికి అవసరమైన సవరణలు చేయనుంది.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తంచేశారు. రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం మిఠాయిలు తినిపించుకున్నారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి నిర్ణయించింది. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలుకానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వనుంది.
తొలుత గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ప్రస్తుతం లెక్కల ప్రకారం తెలంగాణలో 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 మండల పరిషత్ లు, 585 జడ్పీటీసీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం: పొంగులేటి
రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించాం
గత మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించాం
దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశాం… pic.twitter.com/1QTb5lYa1W
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2025