Inter Exams 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు హాల్ టికెట్ల డౌన్లోడ్స్ పై కీలక ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం, మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 5వ తేదీ నుండి 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాధారణంగా పరీక్షా కేంద్రాలకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఎల్లుండి నుండి జరిగే ఇంటర్ పరీక్షలకు ఆ నిబంధనలను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా హాలులోకి అనుమతించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.
ఇంటర్ స్టూడెంట్స్ కు బిగ్ రిలీఫ్
ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను ఎత్తివేసిన ఇంటర్ బోర్డు
పరీక్ష కేంద్రాలకు 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యం వచ్చినా విద్యార్థులకు అనుమతి
ఎల్లుండి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం pic.twitter.com/9B2wi9gimu
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025