BSNL Holi Dhamaka Offer: ప్రభుత్వం టెలికా సంస్థ బీఎస్ఎన్ఎల్ స్పీడ్ పెంచేసింది. యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా ప్రభుత్వ టెలికాం సంస్థ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా BSNL హోలీ ధమాకా ఆఫర్‌ను అనౌన్స్ చేసింది.
ఇందులో కంపెనీ తన రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు మునుపటి కంటే ఎక్కువ వాలిడిటీని అందిస్తామని ప్రకటించింది. కంపెనీ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ ఆఫర్‌ను పోస్ట్ చేసి వివరాలను వెల్లడించింది. కంపెనీ చేసిన పోస్టులో దీర్ఘ కాలిక రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. అంటే దీనిలో వినియోగదారులు తక్కువ డబ్బుకు ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్ సౌకర్యాన్ని పొందవచ్చు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ హోలీ ఆఫర్ రూ. 2,399 రీఛార్జ్ ప్లాన్‌లో 30 రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఈ ప్లాన్ 395 రోజుల పాటు మత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ ప్లాన్‌ను 425 రోజుల వరకు పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో బీఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. దీనిలో వినియోగదారులు ఢిల్లీ, ముంబైలోని MTNL టెలికాం నెట్‌వర్క్‌లో ఉచిత జాతీయ రోమింగ్‌తో పాటు ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు.
More colors, more fun, and now more validity!
Get unlimited calls, 2GB data per day, and 100 SMS per day for 425 days, not just 395! All for just ₹2399!
#BSNLIndia #HoliDhamaka #BSNLOffers pic.twitter.com/gZ7GfdnMOK
— BSNL India (@BSNLCorporate) March 3, 2025
దీంతోపాటు ఈ ప్లాన్ లో వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటాను పొందుతారు. అంటే ఈ BSNL ప్లాన్‌లో మొత్తం 850GB డేటా వినియోగదారులకు వస్తుంది. ఇది కాకుండా యూజర్లకు రోజు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఇది కాకుండా కంపెనీ తన మొబైల్ వినియోగదారులందరికీ BiTV ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. దీని ద్వారా మీరు అనేక OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్ పొందుతారు.
Read Also: IRCTC, IRFC: అరుదైన ఘనత .. సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ
ఇదే సమయంలో BSNL తన నెట్‌వర్క్‌ను మెరుగు పరచుకునేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దేశంలో లక్ష కొత్త 4G టవర్లను కంపెనీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం నుంచి కంపెనీ అన్ని టెలికాం సర్కిల్‌లలో నెట్‌వర్క్‌ను క్రమంగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇప్పటివరకు 65 వేలకు పైగా 4G మొబైల్ టవర్లు అమల్లోకి వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో రాబోయే కొన్ని నెలల్లో మిగిలిన మొబైల్ టవర్లు కూడా యాక్టివ్ అవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 9 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులను కలిగి ఉండటం విశేషం. గత ఏడాది ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత దాదాపు 50 లక్షల మంది యూజర్లు BSNLవైపు మారిపోయారు. ఇదే సమయంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ప్రైవేటు టెలికాం సంస్థలు ఆలోచనలో పడ్డాయని నిపుణులు అంటున్నారు.