Oscar Awards 2025..ప్రపంచ సినీ సెలబ్రిటీలు ఎంతగానో ఎదురు చూసే.. సినీ ప్రపంచపు అతిపెద్ద పండుగ ఆస్కార్ వేడుక రానే వచ్చేసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ కేటగిరీలో పోటీపడిన ఉత్తమ నటీనటులకు, ఉత్తమ సినిమాలకు ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారం లభించింది. అటు రెడ్ కార్పెట్ పై టాప్ హీరోయిన్లు హొయలు పోతూ ఆహుతులను అలరించారు. ముఖ్యంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఆసక్తికరంగా మారిన అంశాలు ఇప్పుడు చాలా వైరల్ గా మారాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
రెడ్ కార్పెట్ పై జరిగిన ఆసక్తికర అంశాలు..
ఆస్కార్ 2025 వేడుక చాలా ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి హోస్ట్ గా కానన్ తన పర్ఫామెన్స్ తో నవ్వులు పూయించారు. ఈసారి ఇండియా తరఫున బరిలో నిలిచిన అనూజాకు మాత్రం నిరాశ ఎదురయింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో “అయామ్ నాట్ ఏ రోబో” ను ఆస్కార్ వరించింది. ఇక ఆస్కార్ వేడుకలలో కొన్ని ప్రత్యేకతలు కూడా చోటుచేసుకున్నాయి . అందులో మొదటిది కానన్ హిందీలో మాట్లాడి అబ్బురపరచడం. ఈ ప్రతిష్టాత్మక పండుగకు కానన్ హోస్టుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. ప్రారంభంలో ఆయన హిందీలో మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ” భారత ప్రజలకు శుభోదయం ఈ వేడుక జరిగే సమయం మీకు ఉదయం కదా.. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా..? బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆస్కార్ చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను” అంటూ హిందీలో మాట్లాడడంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అంతర్జాతీయ వేదిక పైనుంచి ఇలా హిందీలో విష్ చేసినందుకు ఆనందిస్తున్నారు.
స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన 16 వేల క్రిస్టల్స్ డ్రెస్..
ఆస్కార్ కు విచ్చేసిన సెలబ్రిటీలు చాలా ట్రెండీ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకున్నారు. అందులో ఒకరు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పవచ్చు. ఆమె ఎవరో కాదు పాప్ సింగర్ నటి సెలీనా గోమేజ్.. రోజ్ గోల్డ్ గౌన్ లో మెరిసారు. ఈ డ్రెస్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే 16 వేల క్రిస్టల్స్ ను పొదిగి దీనిని తయారు చేశారు. ప్రస్తుతం ఈ డ్రెస్ అటు డిజైనర్లను కూడా ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం. ఈ గౌనులో ఆమె దేవకన్యలా అనిపించిందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
సెలబ్రిటీలకు షార్ట్ అండ్ స్వీట్ నిబంధన..
ఇకపోతే ఆస్కార్ అందుకున్న ఆనందంలో మనసులోని భావాలను పంచుకోవడానికి అకాడమీ వీలు లేకుండా చేసింది. అందుకే అవార్డు అందుకున్న వారి స్పీచ్ లను కేవలం 45 సెకండ్లకే పరిమితం చేస్తూ.. వారి ఆనందాన్ని సార్ట్ అండ్ స్వీట్ గా పంచుకోవాలని చెప్పింది.
ALSO READ:Bipasha Basu: సింగర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..!
22 ఏళ్ల తర్వాత అలాంటి సీన్ రిపీట్..
ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అడ్రియన్ బ్రాడీ రెడ్ కార్పెట్ పై ముద్దు సీన్ రిపీట్ చేశారు. 2003లో ది పియానిస్ట్ చిత్రానికి గానూ.. ఆయన ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. ఆ అవార్డు తీసుకోవడానికి వచ్చిన ఈ హీరో అవార్డు అందజేస్తున్న బెర్రీని ముద్దాడారు. అప్పట్లో ఇది చాలా సంచలనం రేపింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఆయన దాన్ని రిపీట్ చేశారు. రెడ్ కార్పెట్ పై హాలీ బెర్రీ ను ముద్దు పెట్టుకుని షాక్ ఇచ్చారు. 22 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్ అంటూ నెటిజన్స్ దీనిని వైరల్ చేస్తున్నారు.