BigTV English

Padma Awardees Felicitation : “పద్మ” గ్రహీతలను సత్కరించిన సీఎం రేవంత్.. హాజరైన మంత్రులు

Padma Awardees Felicitation : “పద్మ” గ్రహీతలను సత్కరించిన సీఎం రేవంత్.. హాజరైన మంత్రులు
Padma Awardees Felicitation

Padma Awardees Felicitation(Latest news in telangana): ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పద్మవిభూషణ్‌ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, కేతావత్‌ సోమ్‌లాల్‌, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కూరెళ్ల విఠలాచార్యను సత్కరించారు. తెలుగువారు పద్మ పురస్కారాలకు ఎంపిక కావటం తెలుగుప్రజలందరికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పద్మ పురస్కారాలకు ఎంపికైన కవులు, కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. వారికి రూ.25 లక్షలు, ప్రతినెలా రూ.25 వేలు ప్రభుత్వం తరపున అందజేస్తామని తెలిపారు.


చిరంజీవి తనకు పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో విందు కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెగాస్టార్‌కు ఆయన పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రామ్ చరణ్‌తో కొద్దిసేపు ముచ్చటిించారు. ఈ విందుకు శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×