ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలదు.. ఏఐ.. అవును.. ఇప్పుడు ఏ రంగంలో చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూరిపోయింది. ఎడ్యూకేషన్, హెల్త్, అగ్రికల్చర్, అన్నింట్లో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. మనిషి పనిని మరింత ఈజీ చేస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏఐ వైపు చూస్తోంది. మనకేం తక్కువ అంటూ ప్రపంచంతో పాటు వేగంగా పరుగులు పెడుతోంది తెలంగాణ. దేశంలో కనివీని ఎరుగని రీతిలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఏఐ గ్లోబల్ సమ్మిట్ -2024.
దేశంలో ఇప్పటి వరకు ఎవరు చేయని ఘనత హైదరాబాద్ కు దక్కింది. గురువారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా రెండురోజులపాటు ఏఐ గ్లోబల్ సమిత్-2024 ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించగా.. 200 ఎకరాల్లో నిర్మిస్తున్న AI సిటీ లోగోను, 25 అంశాలతో కూడిన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు.
మన దేశంలో ఏఐ గ్లోబల్ సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఆ ఘనతను హైదరాబాద్ సిటీ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ కంపెనీల సీఈవోలు ఈ సదస్సుకు హాజరయ్యారు. దాదాపు 2 వేలకు పైగా ప్రతినిధులు ఈ బిగెస్ట్ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో కొత్త టెక్నాలజీతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలోని వినూత్న ప్రాజెక్టులను ఈ సమ్మిట్ లో ప్రదర్శిస్తారు.
ఈ ఈవెంట్‌లో ప్రధాన వేదికతో పాటు 4 అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై AI కి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్‌లు ఏర్పాటు చేశారు. అంటే ఓ విధంగా ఏఐ గురించి తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాల్సిందేనన్నమాట. నిజానికి ఇలాంటి ఐడియా ఇండియాలో ఏ రాష్ట్రానికి రాలేదు. అందుకే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడానికి ముందు అంటే ఎన్నికల ముందే డిక్లరేషన్ లో చెప్పినట్టే ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read: హైదరాబాద్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. రాజధానిగా మారనుందా?
చెప్పాలంటే రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలుకొని ఇప్పుడు అన్నింట్లో ఏఐ వచ్చేసింది. మరి మనమెందుకు వెనక ఉన్నాం.. లేదు మనం అభివృద్ధి చెందుతున్న నగరాలకు పోటీగా ఉండాలి.. అలా చేయాలంటే మనం ఏఐ ను అడాప్ట్ చేసుకోవాలి.. అందుకే హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే దోరణితో ముందుకు వెళ్తున్నారు.
ఇక తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అత్యాధునిక వసతులతో ఏఐ సీటీ విర్మిస్తామని, రాబోయే మూడేళ్లలో ఏఐ గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ మారబోతున్నదన్నారు. ఏఐ పెట్టుబడులకు ఇండియా గమ్యస్థానంగా ఉందని చెప్పిన శ్రీధర్ బాబు.. తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏఐ ఎంత ముఖ్యమో చెబుతూనే ఉంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. ఇప్పుడిప్పుడు ఏఐ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే.. మనం కూడా మొదట్లోనే అందిపుచ్చుకుంటే భవిష్యత్ లో అది రాష్ట్రభవిష్యత్ కే కాదు.. దేశ భవిష్యత్ కే పనికొస్తుందని అనే ఆలోచన సర్కార్ ది. అందుకే ఎక్కడ కాంప్రమేజ్ అవ్వడం లేదు.. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్ ‘అనే థీమ్ తో దూసుకెళ్తోంది.
నిజానికి చాలా మందికి ఏఐతో ఉద్యోగాలు కోల్పోతాయనేది పెద్ద డౌట్.. అలా జరిగాయి కూడా.. అంతెందుకు కంప్యూటర్లు వచ్చిన కొత్తలో కూడా ఇలాంటి డౌట్సే వచ్చాయి. కంప్యూటర్లకు వ్యతిరేకంగా అప్పట్లో ఉద్యమాలే జరిగాయి. ఇప్పుడు ఏఐ రాకతో సేమ్ సిచ్యూవేషన్.. కానీ అందరు అనుకున్నట్లు ఏఐతో ఉద్యోగాలు పోవు.. కొత్త ఉద్యోగాలు వస్తాయి.. అది ఎలా .. వారి ఉద్యోగాల కోసం ఏం చేయాలి.. ఇలాంటి అన్ని డౌట్స్ ఏఐ సదస్సులో ప్రధానగా చర్చించారు. అంటే ప్రభుత్వం పెట్టుబడులే కాదు.. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా కట్టుబడి ఉంది.