BigTV English

Education Commission: రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ

Education Commission: రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ

Telangana Education Commission: తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక చైర్మన్, ముగ్గురు సభ్యులతో కూడిన విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులను త్వరలో నియమిస్తామంటూ ప్రభుత్వం అందులో వెల్లడించింది.


Also Read: బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ తాజా రిపోర్ట్

ఇదిలా ఉంటే.. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విద్యాకమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతోపాటు అంగన్ వాడీ, ప్రాథమిక పాఠశాలలు నుంచి యూనివర్సిటీల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం వెల్లడించారు. కాగా, తాజాగా ప్రభుత్వం ఆ మేరకు విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది.


Also Read: 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. ఏ ఏ గ్రామాలయ్యాయంటే..?

నూతనంగా ఏర్పడిన విద్యా కమిషన్ లక్ష్యాలివే…

– మారుతున్న ఎడ్యుకేషనల్ ల్యాండ్ స్కేప్ ను పరిగణనలోకి తీసుకుని విద్యారంగంలో విధాన రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం.
– థింక్ ట్యాంక్ గా పనిచేయడం
– పైలట్ అధ్యయనాలు చేయడం
– పాలసీ నోట్ లను అభివృద్ధి చేయడం
– సంప్రదింపులు చేయడం, మార్గదర్శకాలు, నియమాలు, సులభతరం చేయడం వంటి అంశాలపై అధ్యయనం చేసి కమిషన్ సిఫార్సు చేయనున్నది.
– నాణ్యమైన ఉన్నత విద్య, ఉన్నత విద్యా సంస్థలతో అప్రెంటిస్ షిప్/ ఉపాధి నైపుణ్యాలను ఏకీకృతం చేయడం, స్కూళ్లలో నాణ్యమైన విద్య, విద్యార్థుల సమగర్ అభివృద్ధిపై దృష్టి
– ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పునాది నైపుణ్యాలు వంటి అంశాలపై పరిశీలన చేయనున్నది.
– విద్యార్థులను బాధ్యతాయుతమైన ప్రపంచ స్థాయి పౌరులుగా తయారు చేసేందుకు కావాల్సిన విద్యపై సిఫార్సులు చేయనున్నది.

Also Read: ఇక.. జిల్లాల్లోనూ హైడ్రా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా విద్యపై ప్రత్యేక చర్చలు జరిపింది. ఆ చర్చల్లో కీలక అంశాలపై తీవ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, విద్యా నిపుణులతోపాటు పలువురు ప్రముఖులు ఆ చర్చల్లో పాల్గొన్నారు. విద్యా రంగంలో ఇది వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మార్పులు చేయాలని నిర్ణయించింది. కేవలం విద్య మాత్రమే కాదు.. కమ్యూనికేషన్ స్కిల్స్ ను కూడా నేర్పాలని భావించింది. యూనివర్సిటీ నుంచి జాబ్ కు వెళ్లిన తెలంగాణ స్టూడెంట్ కు కేవలం దేశ స్థాయిలోనే కాదు.. ప్రపంచ స్థాయిలో ఉద్యోగం ఇచ్చేందుకు పోటీ పడాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ దిశగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఏ ఏ మార్పులు చేయాలో చర్చలో పాల్గొని ఐఏఎస్ ఆఫీసర్లు, నిపుణులు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×