Heavy Rains in Telangana for Today And Tomorrow: భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైతుంది. ఎక్కడ చూసినా వరదలు ముంచెత్తి కనిపిస్తున్నాయి. వర్షపు నీరు భారీగా ప్రవహిస్తున్న కనిపిస్తున్నది. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లింది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బాధితులను పరామర్శిస్తూ వారికి సాయం చేస్తున్నారు.
Also Read: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి
ఇదిలా ఉంటే.. వాతావరణ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. వర్షానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి మరో ముంపు పొంచి ఉందని చెప్పింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నేడు రాత్రి, రేపు తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో మంగళవారం భారీగా వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read: అధైర్యం వద్దు.. అండగా ఉన్నాం: వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన
ఇటు బుధవారం రోజు ఆసిఫాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతాయని తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు స్పష్టం చేసింది.
కాగా, మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడినట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని పేర్కొన్నారు. ఇటు యానాం, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read: హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో భారీగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలు దంచి కొడుతుండడంతో వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు వాటర్ ప్రాజెక్టులలోకి నీరు కూడా భారీగా వచ్చి చేరుతున్నది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లను కూడా ముంచెత్తింది. వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యవాతపడ్డారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అక్కడ వర్షం కురిసింది.