E-Paper
Advertisement

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్
Advertisement

Musi Riverfront: మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయంతోపాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి రూ.1100 కోట్లకు పైగానే అనుమతులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పనులు జోరందుకోనున్నాయి.

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్‌ఫ్రంట్‌ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర స్వామి ఆలయం అభివృద్ధితోపాటు ఆరు లేన్ల రహదారికి సుమారం రూ.1,108.27 కోట్లకు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు G.O నెంబర్ 928 ను విడుదల చేసింది.  గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులకు రూ.948.65 కోట్లు కేటాయించింది. ఆలయ సముదాయంలో రాజ గోపురాలు, యాగశాల, పుష్కరిణి వంటివి నిర్మాణాలు చేయనున్నారు.

Advertisement

ఆ ప్రాంతంలో ఆరు లేన్ల రహదారి కోసం మరో రూ.159.62 కోట్లు కేటాయించింది. 30 మీటర్లు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించనుంది. ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు దాదాపు 2.50 కిలోమీటర్ల మేరా నిర్మించనున్నారు. ఈ రహదారి గ్రేహౌండ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు అనుసంధానం జరగనుంది. మూసీ రివర్‌ఫ్రంట్ రోడ్ నెట్‌వర్క్‌తో ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి కనెక్టివిటీ కల్పించనున్నారు. ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ALSO READ: రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

Advertisement

రూ.700 కోట్లతో ఆలయ ప్రాజెక్ట్‌కు ఈ కమిటీ సాంకేతిక మార్గ దర్శకత్వం అందించనుంది. డిజైన్లు, డీపీఆర్‌లు, రేట్లు, టెండర్లపై కీలక పాత్ర. ఈ కమిటీలో ఆర్‌ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్- కో-చైర్మన్‌గా ఉండనున్నారు. MRDCL చీఫ్ ఇంజనీర్-కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఎండోమెంట్స్ చీఫ్ ఇంజనీర్, ఆలయ ఆర్కిటెక్చర్ నిపుణుడు శివనాగిరెడ్డి, ఫైనాన్స్ శాఖ అదనపు కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలు, నిర్మాణ పనులు, మౌలిక వసతులపై టెక్నికల్ కమిటీ పర్యవేక్షణ ఉండనుంది.

Related News

కొత్త బైక్, వాహనాలు కొనేవారికి బిగ్ అలర్ట్.. డీలర్లకు సర్కార్ వార్నింగ్?

ఇంట్లో దర్జాగా గంజాయి సాగు చేస్తున్న బీటెక్ విద్యార్థి!

హుజురాబాద్‌లో డేంజర్ బెల్స్.. పొంచి ఉన్న భారీ ప్రమాద ముప్పు!

పింఛన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి?

ఐబొమ్మ రవిని మించిన మరో డిజిటల్ పైరసీ నెట్‌వర్క్.. ఒక్కో సినిమాకు రూ. 20 వేలు!

ఎవరీ రేష్మా డాన్? బ్యూటీషియన్‌గా పనిచేస్తూ రౌడీయిజం.. చివరికి ఏమైందంటే?

తెలంగాణలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..?

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ దుకాణం దగ్ధం

Big Stories

Advertisement
×