BigTV English

Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌పై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం.. పదేళ్లలో ఏం చేశారు? కాగితాలకే పరిమితమా?

Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌పై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం.. పదేళ్లలో ఏం చేశారు? కాగితాలకే పరిమితమా?

Damodar Raja Narasimha: తెలంగాణ ఆరోగ్యశాఖలో ఏం జరిగింది? జరుగుతోంది? గడిచిన పదేళ్లు వైద్యం ఎందుకు పడకేసింది? బీఆర్ఎస్ సర్కార్ వైద్య సెక్టార్‌ను గాలికి వదిలేసిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


గత బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. గత ప్రభుత్వం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందన్నారు. జీవోలు తీసుకొచ్చినా ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు.

ఆసుపత్రులలో ఖాళీలకు బాధ్యులెవరు? ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన గత పాలకులు కాదా అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారాయన. ఇప్పుడు ఆ పార్టీ నేతలు మాటలు వింటుంటే.. దెయ్యాలకు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎత్తి చూపారు.


ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బ తీసే విధంగా బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి ఉందన్నది ఆరోగ్య శాఖ మంత్రి మాట. సామాన్యులకు నిరంతరం ఉచితంగా వైద్య సేవలు అందించే డాక్టర్లపై సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం ద్వారా సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని సూటిగా ప్రశ్నించారు.

ALSO READ: అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

గత పాలకుల నిర్ణయాల వల్ల నిర్వీర్యమైన తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థ‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇంత చేస్తున్నా ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు మంత్రి దామోదర రాజనర్సింహ.

ఒక విధంగా చెప్పాలంటే మంత్రి రాజనర్సింహ చెప్పిన మాటలు నిజమే. గడిచిన పదేళ్లలో ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కేవలం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకే పరిమిత మైందన్నది ప్రజల మాట.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలంలోకి రాగానే ఆరోగ్యంపై దృష్టి సారించింది. ముఖ్యంగా హోటళ్లు, హాస్టళ్లపై ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఎక్కడ చూసినా కల్తీ మెటీరియళ్లు, కిచెన్లు ఇవన్నీ చూసి తనిఖీ అధికారులే షాకయ్యారు. వ్యవస్థ ఈ విధంగా ఉందా అని ఆశ్చర్యపోయారు.

ఇలాంటి ఫుడ్ తీసుకున్నామంటూ గ్రేటర్ ప్రజలు షాకయ్యారు. గ్రేటర్‌లో ఇలావుంటే మిగతా ప్రాంతాల్లో ఆరోగ్యం పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న.  అధికారుల తనిఖీలతో బెంబేలెత్తిన హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు  నాణ్యమైన ఆహారంపై దృష్టి సారించారు.

ప్రజావైద్య ఆరోగాన్ని మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా ఆరోగ్యంపై ప్రపంచ బ్యాంకును సంప్రదించింది. ఒకవేళ నిధులు వస్తే.. ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగవు తాయని చెబుతున్నారు మంత్రి రాజనర్సింహ. ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు 7 వేలకు పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని, మరో 6 వేల పోస్టులు భర్తీ దశలో ఉన్నాయని గుర్తు చేశారు.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×