BigTV English

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో రామ్ చరణ్ తేజ్ ఒకరు. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. రంగస్థలం సినిమా తర్వాత తండ్రి మించిన తనయుడు అనిపించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పరిపూర్ణమైన నటుడని బయటకు తీశాడు దర్శకుడు సుకుమార్. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఇచ్చిన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా గ్లోబల్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన కూడా రంగస్థలం రామ్ చరణ్ బెస్ట్ ఫిలిం అని చెప్పాలి. రామ్ చరణ్ తన రెండవ సినిమాతోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొంచెం తేడాగా ఆడినా కూడా, ధ్రువ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.


లేకపోతే రీసెంట్ టైమ్స్ లో చాలా పెద్ద హీరోల సినిమాలు పై సినిమాకు వచ్చిన కలెక్షన్స్ వేస్తున్నారు. అయితే ఆ కలెక్షన్స్ నిజమో కాదో కూడా తెలియదు. కొన్ని సినిమాలుకు బ్రేక్ ఈవెన్ అవ్వకుండానే 100% బ్రేక్ ఈవెన్ అంటూ పోస్టర్స్ వేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకి కేవలం 7 రోజుల్లోనే 212 కోట్లు వసూలు చేసినట్లు పోస్టర్ చేశారు. అలానే దేవర సినిమాకి మొత్తంగా 500 కోట్లు వచ్చినట్లు పోస్టర్ వేశారు. అయితే ఇవన్నీ కూడా ఫేక్ కలెక్షన్స్ అని చాలామందికి తెలుసు. రీసెంట్ గా యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా మాట్లాడుతూ ఫ్యాన్స్ అండ్ హ్యాపీ చేయడానికి పోస్టర్స్ వేస్తాం అంటూ చెబుతూ వచ్చారు. ఇంతకుముందు ఒకసారి మాట్లాడుతూ నాకు వచ్చిన లాభాలను నేను ఎందుకు బయట పెట్టుకుంటా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే రామ్ చరణ్ దీనిపైన స్పందించారు. ఇలా పోస్టర్ పైన కలెక్షన్స్ వేయటం అనేది మంచి పద్ధతి కాదు. నేను నాతో సినిమా చేసే దర్శకులకు నిర్మాతలకు ప్రత్యేకించి చెబుతున్నాను. దయచేసి నా సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఇలా పోస్టర్స్ లో వేయొద్దు. ఒక సినిమా హిట్ అనేది మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ అవ్వాలి. ఒక సినిమా హిట్ ప్లాపును డిసైడ్ చేయాల్సింది కేవలం ప్రేక్షకులు మాత్రమే అంటూ చెబుతూ వచ్చారు. వాస్తవానికి రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ రెండు షోలు పడగానే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మౌత్ టాక్ ద్వారా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సినిమాలు మౌత్ టాక్ తో హిట్ అయ్యాయి. రీసెంట్ టైమ్స్ లో కలెక్షన్స్ బట్టి సినిమా హిట్ ను నిర్ణయిస్తున్నారు కానీ ఒకప్పుడు ఏ సినిమా ఎన్ని రోజులు ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేదాన్ని బట్టి ఆ సినిమా హిట్టును నిర్ణయించేవాళ్ళు.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×