Satyabhama Today Episode October 15th : నిన్నటి ఎపిసోడ్ లో బామ్మ అందరికీ నలుగు పెట్టి స్నానం చెయ్యమని చెబుతుంది. క్రిష్ మారం చేస్తే బామ్మ పట్టుకొచ్చి సత్య ముందు కూర్చొ బెడుతుంది. ఇక ఇంట్లోని అందరు కోడళ్ళు తమ భర్తకు స్నానం చేయించడానికి రెడీ అయ్యారు.. అటు నందిని ఇంట్లో హడావిడి చేస్తుంది. మైత్రి వెళ్ళిపోతుందన్న సంతోషంలో మైత్రి మీద లేనిపోని ప్రేమను ఓలక బోస్తుంది. పండగ అని చీరను తెచ్చి ఇస్తుంది. ఇక మైత్రి నీ మొగుడును కూడా ఎగరేసుకొని పోతాను అని మనసులో అనుకుంటుంది. నందిని బామ్మ మీద కౌంటర్స్ వేస్తుంది. ఆ ఎపిసోడ్ మొత్తం సరదాగా మారుతుంది. హర్షకు నలుగు పెట్టడానికి అంతా సిద్ధం చేస్తుంది. అది చూసిన మైత్రి హర్షకు నేనే నలుగు పెట్టాలని నందినిని గదిలోకి వెళ్ళగానే లాక్ పెడుతుంది.. ఎవరు పెట్టారా అని ఆలోచిస్తుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ లో విషయానికొస్తే… మహదేవయ్య ఇంట్లో దసరా సంబరాలు మొదలవుతాయి. బామ్మ అందరి మగాళ్ళకి తన భార్యలతో నలుగు పెట్టాలని చెబుతుంది. అయితే క్రిష్ మాత్రం నలుగు పెట్టించుకోనని మారం చేస్తాడు. బామ్మ బలవంతంగా క్రిష్ ను నలుగు పెట్టించుకోవాలని చెప్తుంది. అలా కుటుంబంలోని మగవాళ్ళందరూ నలుగు పెట్టించుకుని స్నానం చేస్తారు. కృష్ణ లోపలికి తీసుకెళ్లిన సత్య తన తలని టవల్తో తుడుస్తుంది. వీరిద్దరి మధ్య కాస్త రొమాంటిక్ సీన్స్ సాగుతాయి. నన్ను ముట్టుకోవద్దు నేను తుడిచేంతవరకు నన్ను ముట్టుకోవద్దు అని క్రిష్ తో చెబుతుంది. దానికి భారీ డైలాగులు కొడతాడు. వీరిద్దరి సరసాలు ఎపిసోడ్కి హైలెట్ గా నిలిచాయి. అప్పుడే బామ్మ వీళ్ళ గదిలోకి వస్తుంది. ఏంట్రా ఇది అనేసి అడుగుతుంది. క్రిష్ సరిగ్గా సమయానికి వస్తావే నిన్ను బొంద పెట్టేస్తాను అనేసి అంటాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏదో ఒకటి తెస్తావ్ నువ్వు అసలు కామ్ గా కూర్చోవా అనేసి క్రిష్ భామపై కోపడతాడు. ఈరోజు పండగ రా అది పూజ చేయాలి అని సత్యని భామ తీసుకెళ్తుంది.
ఇక దసరాకు ఆయుధ పూజ చెయ్యడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ సీరియల్ లో కూడా అది సాగింది. మహదేవయ్య ఇంట్లో అన్న ఆయుధాలని సిద్ధం చేయమని రుద్రతో చెబుతాడు. ఆయుధాలన్నీ పూజకు పెట్టారా అనేసి అడుగుతాడు. నిజంగా ఉన్నాయి బాబు ఇంకా పూజ మొదలు పెడతామా అనేసి రుద్రా మదేవయ్యను అడుగుతాడు.. బైరవి సరే పెనిమిటి పూజ మొదలు పెడదామా అనేసి అంటుంది. అప్పుడే సత్యను చూసిన మహదేవయ్యా ఈసారి నువ్వు కాదు పూజ చేయాల్సింది.. ఇంటికి కొత్త కోడలు వచ్చింది తన చేత పూజ చేయించాలి అనేసి బైరవి తో మహదేవయ్య అంటాడు.. ప్రతి ఏడాది దసరాకు ఆయుధ పూజా ఎప్పుడు నా చేతే కదా పెనిమిటి పూజ చేయించేది ఇప్పుడేంటి కొత్తగా అనేసి మహాదేవయ్యను అడుగుతుంది భైరవి.. అప్పుడు రుద్ర కూడా బైరవికి సపోర్ట్ చేస్తాడు. అమ్మ చేస్తే కలిసి వస్తుంది కొత్తగా ఏందీ అంటాడు. దానికి మహదేవయ్యా కొత్తకోడలు వచ్చేసింది. కొత్త కోడలు చేత ఇంట్లో పూజ చేయించడం ఆనవాయితీ అలాగే తెలివైనది చురుకైంది కాబట్టి సత్యమే ఇప్పుడు పూజ చేయాలి అనేసి మదేవయ్యా చెప్తాడు.. మహదేవయ్య వాళ్ల అమ్మ కూడా ఆయుధాలు అవి ఇవి దానికి ఎందుకు లేరా బైరవినే పూజ చేయించమని చెప్పు అంటాడు. అప్పుడే ఇంట్లోకి మీడియా వాళ్ళు వస్తారు. వాళ్లను చూసి మహదేవయ్య రుద్ర షాక్ అవుతారు. మహదేవయ్యతో మన ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది బాపు అని నేను మాట్లాడి పంపిస్తానని వెళ్తాడు. మిత్రులతో తర్వాత మాట్లాడతాం ఇప్పుడు మా ఇంట్లో పూజ జరుగుతుందని రుద్ర చెప్తాడు. మీడియా వాళ్లని నేనే రమ్మన్నాను మామయ్య గురించి మామయ్య చేసే గొప్ప గురించి చెప్పాలి కదా అనేసి మీడియా వాళ్లని నేనే పిలిపించాను అంటుంది.
రుద్రా సత్య పై కోప్పడతాడు. ఏదైన చేసేటప్పుడు ఒక మాట చెప్పాలని లేదా అనేసి సత్యను తిడతాడు. భైరవి కూడా అంతా తను ఇష్టమే అయిపోయింది అనేసి మండిపడుతుంది. ఇక సత్య మీడియాతో మాట్లాడుతుంది. మా మామయ్య ఆయుధాలను వదిలేసి జనాల్లో మనిషిగా బతకాలని అనుకుంటున్నాడు ఇలాంటి నాయకుడు మనకి మళ్ళీ రారు ఒక పేదింటికి కూతుర్ని కోడలుగా పంపారు అలాగే పేరెంటి అమ్మాయిని కోడలుగా చేసుకున్నారు అనేసి గొప్పగా చెప్తుంది. మీడియా ఉందని మహదేవయ్య సత్య ఏం చెప్తే దానికి తలాడిస్తాడు.. మా ఇంట్లో ఉండే ఆయుధాలని పోలీసులకి అప్పగించాలని మావయ్య నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఒక ఎమ్మెల్యేకి కావాల్సిన లక్షణాలు మామయ్యకి పుష్కలంగా ఉన్నాయని మీడియాతో సత్యం అంటుంది.. అప్పుడే పోలీసులు వస్తారు. మహదేవయ్యా పోలీసులకు తన ఆయుధాలను ఇవ్వమని తన అనుచరులతో చెప్తారు. ఇక హర్ష నందిని చీర కట్టుకున్న మైత్రిని చూసి నందిని అనుకొని వెనకనుంచి గట్టిగా వాటేసుకుంటాడు. మైత్రి చెప్పబోతుంటే చెప్పొద్దని నోరుమూస్తాడు. ఇక మైత్రి లోపల సంతోషపడుతుంది. హర్ష మైత్రిని కౌగిలించుకోవడం చూసి నందిని కోప్పడుతుంది. కావాలని చేయలేదు ఏదో పొరపాటున చేశాను ఈ చీర నువ్వు కట్టుకున్నవని అనుకొని మైత్రిని హగ్ చేసుకున్నానని నందినితో హర్ష అంటాడు. నిన్ను అనడం కాదు ఆ చీరని వెంటనే తగలబెట్టాలి అనేసి నందిని కోపంగా వెళుతుంది. మహదేవయ్య సత్య చేసిన పనికి షాక్ లో ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సత్య మహాదేవయ్యకు స్వీట్ ఇస్తుంది. కొత్త ఆయుధాలు కొనడం పెద్ద పని కాదని చెబుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…