BigTV English
Advertisement

Oscars 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’.. అసలు ఇదెలా సాధ్యం.?

Oscars 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’.. అసలు ఇదెలా సాధ్యం.?

Oscars 2025: మామూలుగా ఒక సినిమాకు ఆస్కార్ రావాలంటే అది చాలా పెద్ద విషయం. ఎంతో బ్లాక్‌బస్టర్ సాధించినా, ప్రపంచం మొత్తం ఒక సినిమాను మెచ్చుకున్నా కూడా దానికి ఆస్కార్ లభిస్తుందనే గ్యారెంటీ లేదు. అందుకే సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరికి ఆస్కార్ అందుకోవాలనే కల ఉంటుంది. అలా ఆస్కార్ 2025 బరిలో నిలిచే సినిమాల లిస్ట్ బయటికొచ్చింది. అందులో సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ఉండడంతో ప్రేక్షకులంతా షాకవుతున్నారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మినిమమ్ ఇంప్రెస్ చేయలేకపోయింది. అలాంటిది ఆస్కార్ జ్యూరీని మాత్రం అలా ఎలా ఇంప్రెస్ చేసిందా అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’ కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది.


డిశాస్టర్ సినిమా

‘కంగువా’ (Kanguva) కొంతవరకు బాగానే ఉంది అనిపించినా స్టోరీ విషయంలో దర్శకుడు శివ.. తాను కన్ఫ్యూజ్ అయ్యి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు. అయినా కూడా ఈ మూవీ ఆస్కార్ వరకు వెళ్లడం అనేది చాలా గ్రేట్ అని సూర్య ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతున్నారు. మొత్తానికి ‘కంగువా’ సినిమా అనేది సూర్య తన కెరీర్‌లో తీసుకున్న వేస్ట్ డెసిషన్ అని చాలామంది ప్రేక్షకులు తనను ట్రోల్ చేశారు. ఇలాంటి సినిమా కోసం, ఇలాంటి కథ కోసం సూర్య అంత కష్టపడ్డాడా అని విమర్శించారు. మొత్తానికి తన కష్టాన్ని ఆస్కార్ గుర్తించినట్టుంది. అందుకే ఈ మూవీని ఏకంగా బెస్ట్ సినిమాల కేటగిరిలో యాడ్ చేసింది. ఇక ‘ది గోట్ లైఫ్’ కూడా ఆస్కార్ బరిలో నిలవడంపై పృథ్విరాజ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ప్చ్..ఫ్యాన్స్ హర్ట్.. మారుతి పై గుస్సా..?

యాక్టింగ్‌కే ఆస్కార్

పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ఆడు జీవితం’ మూవీ ‘ది గోట్ లైఫ్’ అనే పేరుతో తెలుగులో కూడా విడుదలయ్యింది. ఈ సినిమా కోసం తాను దాదాపుగా 16 ఏళ్ల నుండి కష్టపడుతున్నానని చెప్పి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశాడు ఈ హీరో. అప్పటివరకు మలయాళంలో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అదే కేటగిరిలో ‘ఆడు జీవితం’ కూడా చేరింది. అందులో ముఖ్యంగా పృథ్విరాజ్ సుకుమారన్ నటన అందరి చేత కంటతడి పెట్టించింది. మొత్తానికి ఆస్కార్ బరిలో ‘ఆడు జీవితం’ చేరడంతో ఈ మూవీకి తగిన గుర్తింపు లభించిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఛాన్స్ మిస్

ఇండియా నుండి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ మాత్రమే ఉన్నాయి. ఎన్నో ఇంగ్లీష్‌తో పాటు ఫారిన్ భాషా చిత్రాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ముందుగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ అది షార్ట్ లిస్ట్ మాత్రం అవ్వలేకపోయింది. దీంతో ఆస్కార్ గెలిచే అర్హత ఆ సినిమాకు ఉన్నా మిస్ అయ్యిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×