TG Inter Result 2025: తెలంగాణ ఇంటర్మీడియట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆయా ఫలితాలు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు.
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఒక వారం గడువు ఇస్తున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. నెల రోజుల తర్వాత ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు అంటే మే 22 నుంచి జరగనున్నాయి. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్, ప్రథమ, ద్వితీయ పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షలకు దాదాపు 9.97 లక్షల (ఫస్ట్, సెకండ్) మంది హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్ 66.98 శాతం మంది పాస్ అయినట్టు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఫస్ట్ ఇయర్‌కు దాదాపు 4 లక్షల 88 వేల మంది హాజరయ్యారు. అందులో బాలికలు-73.83 శాతం పాసయ్యారు. బాలురలు 57.83 శాతం పాసయ్యారు.
సెకండ్ ఇయర్ పరీక్షలు 5 లక్షల 5 వేల మంది హాజరయ్యారు. సెకండ్ ఇయర్ 71.37 శాతం పాసైనట్టు వెల్లడించారు. అందులో బాలికలు 74.21 శాతం కాగా, బాలురులు 57.31 శాతం పాసైనట్టు తెలిపారు. వివరాలు తెలుసుకునేందుకు ఈ సైట్‌ని క్లిక్ చేయగలరు. https://tgbie.cgg.gov.in/
ALSO READ: రాజీవ్ యువ వికాసం కీలక అప్ డేట్స్, ఒక్క ఛాన్స్ ప్లీజ్
ఫస్టియర్‌లో అత్యధికంగా మేడ్చల్ జిల్లా 77.21 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లా 48.43 శాతం విద్యార్థులు పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో అత్యధికంగా ములుగు జిల్లా 80.12 శాతం, అత్యల్పంగా కామారెడ్డి జిల్లా 54.93 శాతంతో విజయం సాధించింది.