Tollywood celebrities: కొన్ని సందర్భాలలో కొంతమంది సినిమాలు చూసి జనాలు బాగా పాడైపోయారు అనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే దానిని పూర్తిగా కొట్టి పడేయలేము గాని కొంత మేరకు మాత్రం కొన్ని సందర్భాలలో నిజమే అనిపిస్తుంది. అలానే సినిమాలు చూసి బాగుపడిన వాళ్లు కూడా ఉన్నారు అనేది ఒప్పుకోలేని వాస్తవం. నిజంగా కొన్ని సినిమాలు మనిషిలో మార్పును కూడా తీసుకొని వస్తాయి అని చెప్పాలి. ఇకపోతే సినిమాల విషయం పక్కన పెడితే కొంతమంది అభిమాన హీరోలు నడుచుకునే తీరు కూడా అభిమానులపై ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి. పుష్ప సినిమా విడుదల సమయంలో చాలామంది అల్లు అర్జున్ లాంటి గెటప్స్ వేసుకొని కనిపించారు. అలానే మిగతా హీరోల అభిమానులు కూడా కొన్ని విషయాలు ఫాలో అవుతుంటారు. ఇటువంటి తరుణంలోని హీరోలు కాస్త ఆచితూచి ముందడుగు వేయాలి.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్
బెట్టింగ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బెట్టింగ్ కి అలవాటు పడ్డాము అంటే దాని నుంచి బయటపడటం అసాధ్యమైన పని. కొంతమందికి వాళ్లకు రియలైజేషన్ వచ్చి బెట్టింగ్ పక్కన పెట్టారు అంటే అది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. ముఖ్యంగా చాలామందికి తెలియని బెట్టింగ్ యాప్ లను తెలుగు సెలబ్రిటీస్ ప్రమోట్ చేయటం అనేది బాధాకరమైన విషయం. చాలామందికి బెట్టింగ్ పైన అవగాహన లేదు కానీ కొంతమంది మాత్రం ప్రేక్షకులు తెలియని బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం వలన వాటి గురించి తెలుసుకొని ఆ చిక్కుల్లో పడి బయటికి రాలేకపోతున్నారు. మొన్న బెట్టింగ్ యాప్స్ అంటూ… విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ లకు నోటీసులు ఇచ్చారు. నిన్న, అల్లు అర్జున్ కి, శ్రీలీలకు నోటీసులు వెళ్లాయి.
Also Read : 9 Years Of Sarainodu : పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం మొదలైంది ఇక్కడే
పీఆర్లు చెప్పడం లేదా.?
ఇక తాజాగా ఈరోజు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మన తెలుగు సెలబ్రిటీస్ కి ఎలాంటి బ్రాండ్లకు ప్రమోట్ చేస్తున్నారో తెలియడం లేదా…? కొంచెం ఫేమస్ అయితే… ఏది పడితే అది ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటురా…? అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ వారి అభిమానులు, ప్రజల గురించి పట్టింపు లేదా..? చాలామంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఏదేమైనా ఈ విషయంలో తెలుగు సెలబ్రిటీస్ కొద్దిపాటి జాగ్రత్త తీసుకొని ప్రమోషన్స్ చేస్తే బాగుంటుంది. ప్రేక్షకు దేవుళ్ళు అంటూ అభిమానులను కొనియాడే హీరోలు, నిజజీవితంలో కూడా వాళ్లని తప్పుదారి పట్టించకుండా ఉండే ప్రయత్నం చేయటం అనేది ముఖ్యమైన విషయం.
Also read : Badshah : పాకిస్థానీ నటితో బాలీవుడ్ ర్యాపర్ ఎఫైర్… వ్యవహారం మొత్తం బయటపెట్టిన శిల్ప శెట్టి