Big Stories

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఫస్ట్ రంగారెడ్డి, లాస్ట్ కామారెడ్డి

Telangana inter results 2024 update(TS today news): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఉదయం 11 గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం.. ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను వెల్లడించారు. ఫస్టియర్ లో 60.01 శాతం విద్యార్థులు, సెకండియర్ లో 69.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.7 శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలువగా.. 34.81 శాతంతో కామారెడ్డి లాస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా 82.95 శాతం ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్ ను సొంతం చేసుకోగా.. 44.29 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది.

- Advertisement -

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లోనూ బాలికల హవానే కనిపించింది. ఫస్టియర్ ఫలితాల్లో 68.35 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. 51.5 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ లో బాలికలు 72.53 శాతం పాసవ్వగా.. 56.1 శాతం బాలురు ఇంటర్ పరీక్షలు పాసయ్యారు.

- Advertisement -

2023-24 విద్యాసంవత్సరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4 లక్షల 78 వేల 527 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 4 లక్షల 43 వేల 993 మంది సెకండియర్ పరీక్షలు రాశారు.

Also Read : పదో తరగతి ఫలితాలొచ్చేశాయ్.. 17 స్కూల్స్ లో ఒక్కరూ పాసవ్వలేదు!

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. విద్యార్థులు తమ రిజల్ట్ ను http://www.manabadi.co.in/ వెబ్ సైట్ లో లేదా.. https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/ వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత ఉత్తీర్ణులైన విద్యార్థులు మార్క్స్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, మళ్లీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకూ విద్యార్థులు రీ-వెరిఫికేషన్, రీ-వాల్యూయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మే 24 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఇక తెలంగాణ పదోతరగతి పరీక్షల రిజల్ట్స్ ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News