BigTV English

Gifts on Hanuman Movie: టీవీల్లో ‘హనుమాన్’ సినిమా చూడండి.. గిఫ్ట్ పట్టండి.. ఎలాగో తెలుసునా?

Gifts on Hanuman Movie: టీవీల్లో ‘హనుమాన్’ సినిమా చూడండి.. గిఫ్ట్ పట్టండి.. ఎలాగో తెలుసునా?

Watch the Hanuman Movie in TV & Get the Gift: ‘హనుమాన్’ సినిమా సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు. ఏకంగా స్టార్ హీరోల సినిమాలను సైతం తొక్కిపెట్టి నార తీసింది ఈ మూవీ. రిలీజ్‌కు ముందు నుంచే మంచి కమిట్మెంట్‌తో మూవీ టీం ఉంది. అయితే సంక్రాంతి సమయంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు ఉండటంతో ఈ చిత్రానికి థియేటర్లు కరువయ్యాయి. అంతేకాకుండా హనుమాన్‌ సినిమాను వెనక్కి తగ్గి మరొక రోజు ప్రదర్శించమని కూడా సూచనలు వచ్చాయి.


కానీ సినిమాపై మూవీ యూనిట్‌కి ఉన్న నమ్మకంతో వెనక్కి తగ్గలేదు. ఎట్లైతే గట్లే అంటూ స్టార్ హీరో సినిమాలతో సమనంగా అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ మూవీ గూస్ బంప్స్ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమాకు ధీటుగా మరే సినిమా ముందుకు రాలేకపోయింది. మిగతా సినిమాలన్నీ రొటీన్ స్టోరీలతో రాగా.. హనుమాన్ మాత్రం అత్యద్భుతమైన విజువల్ వండర్‌తో వచ్చి ప్రేక్షకులకు కొత్తగా కనిపించింది.

అంతేకాకుండా స్టోరీ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో బాక్సాఫీసు బద్దలయ్యాయి. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఈ మూవీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. బడా హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి రికార్డులు సృష్టించింది. ఇక థియేటర్‌ అనంతరం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది.


Also Read: మరో రికార్డ్ సృష్టించిన హనుమాన్.. 25 సెంటర్లలో 100 డేస్!

ఇక అక్కడ కూడా తన హవా చూపించింది. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన అతి తక్కువ సమయంలోనే మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను అందుకుని అబ్బురపరచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ టీవీల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించి ఈ చిత్రాన్ని ఆస్వాధించడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ జీ తెలుగు ఛానెల్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు బుల్లితెరపై హనుమాన్ మూవీ ఆగమనం ఈ ఆదివారం (ఏప్రిల్ 28) సాయంత్రం 5.30 గంటలకు మీ జీ తెలుగులో అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Also Read: Samantha: వావ్..పెళ్లి గౌనును సమంత ఎంత అందంగా రీమోడలింగ్ చేయించిందో చూశారా?

అంతేకాకుండా మరో సూపర్ డూపర్ ఆఫర్‌ను జీ తెలుగు ప్రకటించింది. ఇందులో భాగంగా జీ తెలుగు హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్‌ను ఆడియన్స్‌ ముందుకు తీసుకొచ్చింది. ఈ సెల్ఫీ కాంటెస్ట్‌లో పాల్గొని కళ్లుచెదిరే కిచెన్ ఐటెమ్స్‌ను గిఫ్ట్‌లుగా పొందొచ్చని తెలిపింది. ఇందుకోసం మీ పిల్లలకి ఇష్టమైన సూపర్ హీరో గెటప్ వేసి వారితో ఒక సెల్ఫీ తీసుకుని 99660 34441 ఫోన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది. లేదా టీవీ స్క్రీన్‌పై ఒక క్యూ ఆర్ కోడ్ వస్తుందని దాదాని స్కాన్ చేసి కూడా సెల్ఫీని అప్లోడ్ చేయవచ్చని తెలిపింది. ఇక ఇందులో గెలుపొందిన వారిని హనుమాన్ మూవీ ప్రసార సమయంలో ప్రకటించనున్నట్లుగా జీ తెలుగు ఛానెల్ తెలిపింది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×