BigTV English

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం

Bridge Collapsed : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురుగాలులకు కూలిన వైనం

Bridge Collapsed in Telangana : ఎనిమిదేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. భారీ ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన.. సోమ, మంగళవారం మధ్యరాత్రి వేళ వీచిన ఈదురుగాలులకు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.


పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రూ.49 కోట్ల బడ్జెట్ లో కిలోమీటరు పొడవున వంతెనను నిర్మించేందుకు 2016లో శంకుస్థాపన చేసింది నాటి ప్రభుత్వం. రెండు జిల్లాల మధ్య రవాణాను మరింత సులభం చేసేందుకు నిర్మించతలపెట్టిన ఈ వంతెనకు శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.

Also Read : నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి.. షాకింగ్ వీడియో!


ప్రాజెక్టులో అవకతవకలు జరగడంతో వంతెన నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. పూర్తయిన పనులకు కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. కాంట్రాక్టర్ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయకుండా ఆపివేసినట్లు తెలుస్తోంది. ఏదేమైన జనసంచారం ఎక్కువగా ఉండని మధ్యరాత్రి వేళ వంతెన కూలిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే ఘటన పగటిపూట జరిగి ఉంటే.. ఏమయ్యుండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు.

Tags

Related News

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Big Stories

×