E-Paper
Advertisement

ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జులెవరు?.. గులాబీలో మొదలైన చర్చ..!

ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జులెవరు?.. గులాబీలో మొదలైన చర్చ..!
Advertisement

BRS Candidates: స్వేచ్ఛ బ్యూరో: ఆ పది నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు ఎవరు? కారు పార్టీలో ఆ నియోజకవర్గంలో అభ్యర్థులు కరువయ్యారా? అనే ప్రచారం జరుగుతుంది. ఆ పది నియోజకవర్గాలలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు అని చర్చ జోరుగా జరుగుతుంది. గద్వాల్ నియోజవర్గంలో బీఆర్ఎస్ లో ప్రజల్లో ఉండి గెలిచే నాయకుడు ఎవరు ఉన్నారనే చర్చ జరుగుతుంది.. అయితే బీఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ లో ఉన్న సరితా బీఆర్ఎస్ లోకి వస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లేదా మళ్లీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు వచ్చి పోటీ చేస్తే గెలుస్తారనే చర్చ కూడా జరుగుతుంది. వీరు కాకుండా ఇంకెవరికి పార్టీ అక్కడ ఎవరికి అవకాశం ఇస్తుందనే ఆసక్తి నెలకొంది. అక్కడ కొంతమంది యువ నాయకులు ఉన్నారు వారు నిత్యం తెలంగాణ భవన్ లేదా హైద్రాబాద్ కి పరిమితం కావడంతో వారికి నియోజకవర్గం పై అంత పట్టులేదని అనే చర్చ కూడా నియోజకవర్గం లో జరుగుతుంది. ఇన్ చార్జీగా హనుమంతునాయుడు మున్సిపల్ ఎన్నికల్లో పనిచేశారు. ఈ నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు మానిటరింగ్ చేస్తున్నారు.

సాయి బాబాకి అవకాశం ఇస్తారా..

ఇదెలా ఉంటే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీ ఫామ్ పై ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ విజయం సాధించారు. ఆ తరువాత ఆయన సైతం కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లిపోయారు. ఈ నియోజకవర్గంలో నెక్ట్స్ బీఆర్ఎస్ నేత ఎవరనే చర్చ జరుగుతుంది. నియోజకవర్గ ఇన్ చార్జీగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గంలో ఉన్న నాయకులతో ఫోర్ మెన్ కమిటీ వేయాలని అక్కడి ఇంచార్జ్ భావిస్తున్నారు. నియోజవర్గ నాయకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత పార్టీ ఉన్న సీనియర్ నాయకుని కి ఇంచార్జ్ ఇస్తే బాగుంటుందని ఆలోచన కి వచ్చినట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే రవీందర్ యాదవ్, నవతారెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి సైతం టికెట్ ఇశిస్తున్నారు. ఆ నియోజవర్గ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ సాయి బాబా కి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతుంది.మరి పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందానే చర్చ ఊపందుకుంది.

నాయకుడు ఎవరు..?

Advertisement

ఇక రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచిన ప్రకాశ్ గౌడ్ సైతం ఆ తర్వాత కాంగ్రెస్‌కి వెళ్ళారు.. అక్కడ ఇంచార్జీ తో పాటు కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి నీ ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. పటోళ్ల కార్తీక్ రెడ్డి నియోజవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచిన తెల్లం వెంకట రావు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అక్కడ బి ఆర్ ఎస్ నాయకుడు ఎవరు అనే చర్చ జరుగుతుంది. గతంలో సీపీఐ నాయకుడు ఇప్పుడు బిఆర్ఎస్‌లో యాక్టివ్ నేత రవి కుమార్ కి పార్టీ అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

Also read: నల్లమలలో మరోసారి కార్చిచ్చు.. మహానంది సమీపంలో ఎగసిపడుతున్న మంటలు!

జీవన్ రెడ్డికే మోగ్గు

Advertisement

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడం తో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉండి పార్టీ రాజీనామా సైతం చేశారు. ఆయనతో బీఆర్ఎస్ సంప్రదింపులు సైతం జరిపింది. త్వరలోనే బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే చర్చఊపందుకుంది. ఎల్ రమణ ఎమ్మెల్సీగా ఉన్నారు. సీనియర్ నాయకులు కాబట్టి ఆయన కి అవకాశం ఇచ్చే ఆలోచన పార్టీ చేస్తుందని చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డికే పార్టీ మొగ్గుపుతున్నట్లు సమాచారం. బాన్సువాడ లో బి ఆర్ ఎస్ బి ఫామ్ పై గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అక్కడ సీనియర్ నాయకులు బాజీ రెడ్డి గోవర్ధన్ కి అవకాశం ఇచ్చే చాన్స్ ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ లోక్ వెళ్ళారు. ఆ నియోజకవర్గంలో పి జె ఆర్ కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు. అదే విధంగా పార్టీలో సీనియర్ నాయకుడు మన్నే గోవర్ధన్ రెడ్డి, లేదా ఆయన సతీమణి మన్నే కవిత సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.

తాటికొండ రాజయ్య..

పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ లోకి వెళ్లిన రీసెంట్ గా బీఆర్ఎస్ కోసమే పని చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బి అర్ ఎస్ గెలుపు కోసం పని చేశారు. కానీ పార్టీ ఇన్ చార్జీగా మాత్రం ఇంకా పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మహిపాల్ రెడ్డికి టికెట్ ఇస్తుందా? లేకుంటే మరో వ్యక్తికి ఇస్తుందా? అనేఆసక్తి కర చర్చజరుగుతుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో కి వెళ్ళడం తో అక్కడ ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఎన్నికల సమయానికి అక్కడ ప్రజల్లో నాయకుని చూసి అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతుంది. స్టేషన్ ఘన్పూర్ లో బి ఆర్ ఎస్ బి ఫామ్ పై కడియం శ్రీహరి గెలిచారు.ఆ తర్వాత కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లిపోయారు. అక్కడ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఆక్టివ్ గా ఉన్నారు. ఆయన కి ఉప ఎన్నికలు వచ్చినా, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. కానీ రాజయ్యకు సైతం నియోజకవర్గ ఇన్ చార్జీ అని ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చజరుగుతుంది.

అవకాశం ఇస్తుందా..?

మరోవైపు పార్టీ మారిన ఆ నియోజకవర్గాలలో ఎవరికి ఇంచార్జ్ ఇస్తే బాగుంటుందనే దానిపై పార్టీ ఇప్పటికే ఇంటర్నల్ గా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పార్టీ లోకల్ నాయకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్టీనీ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ నియోజకవర్గాలపై పార్టీ ఇంకా ఎలా అడుగు వేయనుందో చూడాలి. అంతేగాకుండా ప్రస్తుతం నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తుందా? లేకుంటే కొత్తవారికి అవకాశం ఇస్తుందా? ప్రస్తుతం ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్నవారికి ఏం పదవులు ఇవ్వబోతుంది.. పార్టీని ఎలా గాడిలో పెట్టబోతుందనే చర్చజరుగుతుంది. పార్టీ ఎందుకు దృష్టిసారించడం లేదనేదు.. సరైన నేత లేకపోవడమా? లేకుంటే అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండటంతోనే లైట్‌గా తీసుకుంటుందా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Also Read: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×