E-Paper
Advertisement

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026.. జులై 10 వరకు ఛాన్స్

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026.. జులై 10 వరకు ఛాన్స్
Advertisement

Telangana ITI Admissions 2026:  పదో తరగతి పూర్తి చేసి, త్వరగా సెటిల్ అవ్వాలని చూసే.. విద్యార్థులకు ఐటీఐ ఒక బెస్ట్ ఆప్షన్. టెక్నికల్ కోర్సులపై ఆసక్తి ఉండి, ఇంకా ఐటీఐ అడ్మిషన్ల కోసం అప్లై చేసుకోని వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో.. అడ్మిషన్ల కోసం గడువును జులై 10 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

పదో తరగతి రిజల్ట్స్ వచ్చాక చాలా మంది ఇంటర్ వైపు వెళ్తుంటారు. కానీ తక్కువ టైమ్‌లోనే చేతి నిండా పని దొరకాలి అనుకునే వాళ్లు మాత్రం ఐటీఐ కోర్సులను ఎంచుకుంటారు. తెలంగాణలో.. ఈ ఏడాది ఐటీఐ అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మీరు కూడా ఐటీఐలో చేరాలనుకుంటూ, ఇప్పటివరకు అప్లై చేయడం మర్చిపోయుంటే.. అప్లికేషన్ డేట్‌ను జులై 10 వరకు పొడిగించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.

ఏయే ట్రేడ్స్ అందుబాటులో.. ఉన్నాయి?

Advertisement

ఐటీఐ అనగానే కేవలం ఒకటో రెండో కోర్సులు అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఇండస్ట్రీ నీడ్స్‌కు తగ్గట్టుగా చాలా క్రేజీ ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఎలక్ట్రీషియన్

Advertisement

ఫిట్టర్

మోటార్ మెకానిక్

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్

వెల్డర్, టర్నర్ వంటి ఎన్నో టెక్నికల్ కోర్సులు ఉన్నాయి.

ఈ కోర్సులు పూర్తి చేస్తే అటు ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేస్, బీహెచ్‌ఈఎల్, ఆర్టీసీతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఈజీగా జాబ్స్ సంపాదించవచ్చు.

అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీ!
పాత రోజుల్లా కాలేజీల చుట్టూ తిరిగి ఫారాలు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఆన్‌లైన్ ప్రాసెస్.

ముందుగా తెలంగాణ ఐటీఐ అధికారిక వెబ్‌సైట్ iti.telangana.gov.in ఓపెన్ చేయాలి.

అక్కడ మీ టెన్త్ క్లాస్ మార్క్స్, క్యాస్ట్, ఆధార్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

మీ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి, మీకు నచ్చిన కాలేజీలు, ట్రేడ్స్‌కు ‘వెబ్ ఆప్షన్స్’ ఇచ్చుకోవాలి.

జులై 10 సాయంత్రం లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయడం ముఖ్యం.

Tags

Related News

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

Big Stories

Advertisement
×