Telangana: తెలంగాణలో విద్యారంగంలో భారీ స్కామ్ బద్దలైంది. ఈ వ్యవహారంలో తీగలాడితే డొంక అంతా కదిలింది. ఈ కుంభకోణాన్ని ‘బిగ్ టీవీ’ వెలుగులోకి తీసుకురావడంతో గత పాలకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రస్తుతం 35 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఇంకా మరో 1000 మంది ఉద్యోగాల్లో ఉన్నట్లు తేలింది. దీంతో గత పాలకుల్లో టెన్షన్ మొదలైంది.
తెలంగాణ విద్యాశాఖలో కుంభకోణం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదలింది. ఇప్పటికి 35 మందిపై వేటు వేసింది విద్యాశాఖ. అయితే మరో 1000 మంది ఇలాంటివారు ఉన్నారని తెలియడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న జూనియర్ లెక్చరర్ల వ్యవహారాన్ని ‘బిగ్ టీవీ- ఇన్వెస్టిగేషన్’లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా 1000 మందికి పైగానే జూనియర్ లెక్చరర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ విషయంగా స్వయంగా చెప్పారు వరంగల్ ఆర్జేడీ గోపాల్ నాయక్. వెయ్యికి పైగా ఖాళీలు అవుతాయని మనసులోని మాట బయటపెట్టారు. అంటే ఇంకా వెయ్యి మంది నకిగాళ్లు ఉన్నట్లే. అంత లెక్చరర్లు ఎంతమందికి చదువు చెప్పారు? ఎన్నాళ్లు చెప్పారు? ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత సాలరీలు తీసుకున్నారు? ఎన్ని లక్షలు కొల్లగొట్టారు? ఈ మొత్తం స్కామ్ వెనుక అసలు సూత్రధారి ఎవరి? బీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖను భ్రష్టు పట్టించిందెవరు?
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోకి వచ్చిన తర్వాత 2014-2023 మధ్య వేలాది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్నారు. అయితే సుమారు 3300 మందిని 2023లో రెగ్యులరైజ్ చేసింది అప్పటి ప్రభుత్వం. అందులోని చాలామంది ఇతర రాష్ట్రాల్లోని 16 యూనివర్సిటీల్లో చదివినట్లు సర్టిఫికెట్లు ప్రభుత్వానికి సమర్పించారు. ఉద్యోగులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా? కావా? అనే దానిపై ఇంటర్ బోర్డు అధికారులు ఆయా విశ్వవిద్యాలయాలకు వెళ్లి పరిశీలన చేశారు.
ALSO READ: సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం బంపర్ ఆఫర్.. దసరా బోనస్ ఎంతంటే?
చాలామంది ఉద్యోగులు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత వారిని ఉద్యోగాల నుంచి 35 మందిని తొలగించారు. ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యి మందికిపైగానే ఉండొచ్చని అధికారులు చెప్పారు. దీంతో ఆయా ఉద్యోగాలు చేసేవారితోపాటు ప్రభుత్వంలోని కొందరు అధికారులకు టెన్షన్ మొదలైంది.