Ramiz Raza Cooked Team India: పొద్దున లేస్తే టీమిండియా పై విషం కక్కే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు…. రోజుకో వాదన తెరపైకి తీసుకువస్తారు. టీమిండియా విజయం సాధిస్తే ఫిక్సింగ్ అంటూ రచ్చ చేస్తారు. అదే మనవాళ్లు ఓడిపోతే చేతకాలేదని పరువు తీస్తారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా క్రికెట్ బ్యాటింగ్ వ్యవస్థపై రమీజ్ రాజా ( Ramiz Raza ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ ఒక్కడు లేకపోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు ఒక్కడు ఆడకపోతే… జింబాబ్వే చేతిలో కూడా దారుణంగా టీమిండియా ఓడిపోతుందని బాంబు పేల్చాడు. అభిషేక్ శర్మ ఒక్కడిపైనే టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఆధార పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్, ప్రముఖ కామెంటేటర్ రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ ఒక్కడు లేకపోతే టీమిండియా కుప్పకూలుతుందని బాంబు పేల్చారు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీం ఇండియాను ఓడించేందుకు ప్రతి ఒక్క జట్టు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. కానీ టీమిండియాకు అభిషేక్ రూపంలో భయంకరమైన బ్యాటర్ ఉన్నాడన్నారు. టీమిండియా ఇంత బలంగా తయారు కావడానికి అభిషేక్ శర్మ ఒక్కడే కారణమని పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో టి20 మ్యాచ్ లలో అత్యంత భయంకరంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించారు. అతడికి ఒక్కడిని ఔట్ చేస్తే టీమిండియా కుప్పకూలుతుందని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. అభిషేక్ శర్మ వికెట్ పడిన తర్వాత ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు ఆడితే ఆడతారు… లేకపోతే పెవిలియన్ బాట పడతారని పరువు తీశారు. వాళ్లపైన ఎక్కువగా నమ్మకం కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే అభిషేక్ శర్మ ఒక్కడిని పంపితే.. జింబాబ్వే కూడా సులభంగా టీమిండియాను ఓడిస్తుందని స్పష్టం చేశారు. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ గడ్డలపై అభిషేక్ శర్మ ఇలాగే విఫలమైనందుకు టీమిండియా ఓడిపోయినట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో టీమిండియాతో పాకిస్తాన్ చాలా మ్యాచులు ఆడాల్సిన అవసరం ఉందని… ఇలాంటి క్రమంలో అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు. అప్పుడే టీం ఇండియన్ దెబ్బ కొట్టగలమని పాకిస్తాన్ మాజీ ప్లేయర్, ప్రముఖ కామెంటేటర్ రమీజ్ రాజా వ్యాఖ్యానించారు. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ముందుకు వెళ్లాలన్నారు.