UPSC 2025: సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వీరిలో 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచారు. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.సింగరేణి సంస్థ అధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇక రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష–2025 తుది ఫలితాల్లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఆశిష్ దేశవ్యాప్తంగా ఏఐఆర్–676 ర్యాంక్ సాధించగా, ములుగు జిల్లాకు చెందిన డీ ప్రవీణ్ కుమార్ ఏఐఆర్–793 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. వీరికి ఇండియన్ పోలీస్ సర్వీస్ పొందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
సివిల్ సర్వీసెస్–2025 తుది ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు విశేష ప్రతిభ కనబరిచి దేశవ్యాప్తంగా మంచి ర్యాంకులు సాధించడం ఆనందకరమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.పట్టుదల, కృషి, లక్ష్యసాధన పట్ల నిబద్ధతతో తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్ వంటి అత్యున్నత పరీక్షల్లో సత్తా చాటడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. భవిష్యత్తులో దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని విజేతలకు ఆకాంక్షించారు.
సివిల్స్ సాధించే లక్ష్యంతో సిద్ధమవుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన ఆర్థిక మద్దతు అందిస్తూ వారి కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.అలాగే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించబడినట్లు తెలిపారు. ఈ సహాయం పొందిన అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం, వారిలో 20 మంది తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలవడం గర్వకారణమని అన్నారు.ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా తెలంగాణ యువత మరింతగా సివిల్ సర్వీసెస్ వైపు ముందుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.
Also Read: Inzamam ul haq: బుమ్రా బాల్ టాంపరింగ్ చేశాడు, అతన్ని బ్యాన్ చేయండి !
1 గుడెల్లి సృజన 55 1009215 మహిళ పెదపల్లి ఓబీసీ
2 తరుణ్ తేజ అట్ల 123 8200832 పురుషుడు వరంగల్ అర్బన్ ఓబీసీ
3 బానోత్ లక్ష్మి రఛనా 178 1036767 మహిళ రంగారెడ్డి ఎస్టీ
4 ఎం వెంకటేశ్ ప్రసాద్ సాగర్ 358 1027724 పురుషుడు మహబూబ్‌నగర్ ఓబీసీ
5 మెరుగు కౌశిక్ 399 1019638 పురుషుడు మెడ్చల్-మల్కాజ్‌గిరి ఓబీసీ
6 ప్రీతి రాపర్తి 468 1006190 మహిళ మెడ్చల్-మల్కాజ్‌గిరి ఓబీసీ
7 విక్రమ్ బేతి 472 1034679 పురుషుడు వరంగల్ అర్బన్ ఓబీసీ
8 యశ్వంత్ ఎస్ 475 7600795 పురుషుడు నల్గొండ ఓబీసీ
9 విక్రమ్ సింహా రెడ్డి వి 541 1031203 పురుషుడు రంగారెడ్డి జనరల్
10 ఆశిష్ అనిశెట్టి 676 1405517 పురుషుడు వరంగల్ అర్బన్ ఓబీసీ
11 విజయ్ సింహా రెడ్డి వి 682 1039918 పురుషుడు రంగారెడ్డి జనరల్
12 ఆంగరాజు నవీన్ 715 8202231 పురుషుడు సూర్యాపేట ఎస్సీ
13 పుడారి రాహుల్ 748 1033896 పురుషుడు జగిత్యాల ఓబీసీ
14 కుంమారి శ్రీవన్ కుమార్ 768 1032761 పురుషుడు మెదక్ ఓబీసీ
15 దైనంపెల్లి ప్రవీణ్ 793 1035383 పురుషుడు ములుగు ఎస్సీ
16 ఎస్లావత్ శ్రీరామ్ హర్ష 823 1006955 పురుషుడు రంగారెడ్డి ఎస్టీ
17 బానోతు భారత కుమార్ 900 0324829 పురుషుడు జనగమా ఎస్టీ
18 ప్రత్యూష కట్ట 908 1035611 మహిళ రంగారెడ్డి ఎస్సీ
19 జీతేందర్ నాయిక్ 939 1041100 పురుషుడు భూపాలపల్లి ఎస్టీ
20 దీపక్ శర్మ 951 0801269 పురుషుడు మెడ్చల్-మల్కాజ్‌గిరి జనరల్
Also Read: Tollywood: ఫెయిల్యూర్ హీరో కోసం క్యూ కడుతున్న నిర్మాతలు.. రోడ్డెక్కుతున్న బయ్యర్లు!