MeeSeva: స్వేచ్ఛ బ్యూరో: మీ సేవలో కాగిత రహిత సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చినదని జిల్లా ఇ-డిస్ట్రిక్ మేనేజర్ఎన్. శివ తెలిపారు. బుధవారం గద్వాల మండలంలోని పలు మీ సేవ కేంద్రాలను జిల్లా ఇ-డిస్ట్రిక్ మేనేజర్ శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కాగిత రహిత పాలనలో భాగంగా మీ సేవ కేంద్రాల్లో సేవా రుసుము చెల్లించిన అనంతరం ముద్రిత రసీదులు ఇవ్వబడవని, చెల్లింపు వివరాలు నేరుగా వినియోగదారుల మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపంలో, వాట్సాప్ లలో పంపబడతాయని తెలిపారు.
Also read: Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!
అలాగే, ప్రజలు దరఖాస్తు పత్రాలు పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగా ల్సిన అవసరం లేకుండా, జిపిఓల మొబైల్ యాప్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత అధికారులు వాటిని ఆన్లైన్లోనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని వివరించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మీసేవ సిబ్బంది స్పందించి సేవలను అందించాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలో టిజిటిఎస్, టిఎస్ ఆన్ లైన్ మేనేజర్లు పాల్గొన్నారు.
Also Read: Voter Revision: సర్ ఫైనల్ లిస్ట్‌కు డేట్ ఫిక్స్.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!