TG Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారం చేపట్టాయి. గతంకంటే ఈసారి ఎక్కువగా పార్టీలో బరిలో నిలిచాయి. ఆ పార్టీలు సైతం విస్తృత ప్రచారం చేశాయి. అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధానపోటీ నెలకొంది. అయితే అధికారపార్టీకి ధీటుగా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు ప్రచారపర్వం నిర్వహించాయి. దీంతో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. మెజార్టీ సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నువ్వా.. నేనా అన్నట్లు ప్రచారం కొనసాగించాయి. ఒక్కరోజే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు గెలుపుకోసం పావులు కదుపుతున్నాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి అదిలాబాద్(Adhilabad), నిజామాబాద్(Nizamabad), కరీంనగర్(karimnagar), రంగారెడ్డి(Rangareddy), మెదక్(Medak) జిల్లాల్లో రాజకీయం పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి కొనసాగుతున్న జోరును మున్సిపల్ కేంద్రాల్లోనూ ప్రదర్శించి, పట్టణ ఓటర్లపై పట్టు సాధించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణ తెలంగాణపైనా బీజేపీ దృష్టిసారించింది. ఆయా మున్సిపాలిటీల్లోనూ తమ సత్తాచాటేందుకు పార్టీ కేడర్ ను సన్నద్ధం చేస్తుంది. బీఆర్ఎస్ సైతం గత పదేళ్లుగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ వైఫల్యాలే తమకు కలిసి వస్తుందని ఆశిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల అమలును ప్రచార అస్త్రంగా చేసుకుని జైత్రయాత్ర కొనసాగించాలని, పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలకంటే ఎక్కువగా సాధించేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్లలో త్రిముఖ పోటీ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీకి దక్షిణ తెలంగాణలో బలమైన కేడర్ ఉంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉండగా, బీఆర్ఎస్ తన పట్టును కాపాడుకోవడానికి గట్టిగా పోరాడుతోంది. ఈ ప్రాంతంలో నల్గొండ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ వంటి 3 కార్పొరేషన్లతో పాటు పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నాయి. బీజేపీ సైతం తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ప్రతి మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ 4 కు పైగా కౌన్సిలర్లను గెలుచుకుంటుంది. అయితే ఈసారి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తుంది. అదే విధంగా మిగిలిన జిల్లాల్లోనూ విజయం సాధించి సత్తాచాటేందుకు సిద్ధమవుతుంది.
Also Read: Chinna Jeeyar Swamy: ఆదిశంకరాచార్యులు శుద్ద వైష్ణవుడా..? చిన్నజీయర్ వ్యాఖ్యల్లో నిజముందా..?
అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లింది. మంత్రులకు సైతం బాధ్యతతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలపై గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో సభలతో పార్టీ కేడర్‌తో పాటు ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తమకు అండగా నిలుస్తారని భావిస్తున్నారు. బలమైన అభ్యర్థులను సైతం నిలబెట్టింది. దక్షిణ తెలంగాణలోని తన కంచుకోటలను కాపాడుకోవాలన్న పట్టుదలతో మంత్రులు ఉన్నారు. బీజేపీ మాత్రం కేంద్రం విడుదల చేసిన నిధులపై ప్రచారం చేసింది. మేనిఫెస్టోతో ప్రచారం చేస్తుంది. పట్టణ ఓటర్లు, యువత తమవైపే ఉన్నారనే ధీమాతో అర్బన్ ఏరియాల్లో కమలం జెండా ఎగురవేస్తుందని ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికలను తమ మనుగడకు అత్యంత కీలకంగా భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన పట్టణ ప్రగతి పనులను వివరించారు.
కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలు రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉమ్మడి జిల్లాల ప్రచార బాధ్యతలను మాజీ మంత్రులకే అప్పగించింది. ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు లు సైతం వారి ఉమ్మడి జిల్లాలోనే ప్రచారం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో కలియతిరిగారు. అయితే వారు ఏమేరకు విజయతీరాలకు పార్టీని చేర్చుతారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. పోల్ మేనేజ్ మెంట్ లో మాత్రం వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. ఇదెలా ఉంటే అన్ని పార్టీలకు రెబల్స్ బెడద వేధిస్తుంది. మరోవైపు జనసేన, ఏఐఎఫ్ బీ, వామపక్షాలు, ఎంఐఎం సైతం వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీలతో ఎవరికి ఎఫెక్ట్ పడుతుందోనని చర్చజరుగుతుంది.
కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్-సీపీఐ, బీఆర్ఎస్-సీపీఐ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇతర పార్టీలు పొత్తులతో వెళ్తున్నాయి. అయితే అభిప్రాయ బేదాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న రాజకీయాలతో పొత్తులతో వెళ్తున్నాయి. ఇవి ఆయా పార్టీలకు కలిసి వస్తాయా? ఆ పార్టీ ఓట్లు డైవర్ట్ అవుతాయా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. కొత్తగూడెం జిల్లాల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానపోటీ నెలకొంది. అయితే ఇతర ప్రాంతాల్లో పొత్తులతో పోటీ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ పొత్తుల పోటీ ఏ పార్టీకి కలిసివస్తుందో చూడాలి.