E-Paper
Advertisement

Panchayat Raj: గుడ్ న్యూస్.. పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్లు!

Panchayat Raj: గుడ్ న్యూస్.. పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్లు!
Advertisement

Panchayat Raj: స్వేచ్ఛ బ్యూరో: పంచాయతీరాజ్ లో ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. దీంతో శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 110 వరకు ఎంపీడీఓ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 202 పోస్టులు, 400లకు పైగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం భర్తీపై దృష్టిసారించింది. అందుకు సంబంధించిన సీనియార్టీ లిస్టును ప్రిపేర్ చేస్తుంది.త్వరలోనే ప్రభుత్వానికి అధికారులు అందజేయనున్నారు.

అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు..

పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచేస్తున్నారు. అధికారులు మారుతున్నప్పటికీ కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎట్టకేలకు మోక్ లభించబోతుంది. శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న క్యాడర్​ స్ట్రెంత్​ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మండల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించారు. ఇటీవల ఒకేసారి 74 మంది అధికారులకు పదోన్నతులు కల్పించారు.

ప్రమోషన్లపై ఆశలు

Advertisement

ఇందులో మండల స్థాయిలో కీలకంగా వ్యవహరించే 50 మంది ఎంపీడీఓలు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ల (డీపీఓ)లకు డిప్యూటీ సీఈఓ క్యాడర్‌‌‌‌‌‌‌‌కు ప్రమోషన్లు లభించాయి. దీనికితో మరో 50 నుంచి 60 ఎంపీడీవో పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 110 వరకు ఎంపీడీవోల పోస్టులు ఖాళీలు ఏర్పడగా.. వీటిని భర్తీ చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు మొదలు పెట్టారు. అంతేకాదు, రాష్ట్రంలోని 7 జోన్ల పరిధిలో మొత్తం 680 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 478 మంది మాత్రమే పనిచేస్తుండగా 202 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200కు పైగా సీనియర్ అసిస్టెంట్లు, 400 మందికిపైగా జూనియర్​ అసిస్టెంట్లు ప్రమోషన్లపై ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Defection Case: నేడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై తుది తీర్పు.. నేటితో వారికి తెరపడేనా..!

సీనియర్ లిస్టు తయారు..

Advertisement

మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జ్‌లతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుంది. దీంతో పాలన పరమైన పైల్స్ ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిపై దృష్టిసారించిన ఉన్నతాధికారులు ఇప్పుడు పర్మినెంట్ పోస్టింగ్‌లపై దృష్టి పెట్టింది. సూపరింటెండెంట్లు, ఎంపీవోలుగా పనిచేస్తున్నవారికి ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పించేందుకు సీనియర్ లిస్టును తయారు చేస్తుంది. సూపరింటెండెంట్లు ఖాళీగా ఉన్న చోట సీనియర్​ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నారు. గ్రేడ్​–1 కార్యదర్శులకు ఎంపీవోలుగా, సీనియర్​ అసిస్టెంట్లు ఖాళీలు ఏర్పడినచోట జూనియర్​అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇచ్చేందుకు లిస్టును సిద్ధం చేశారు.

న్యాయపరమైన చిక్కులు

పంచాయతీరాజ్​కమిషనరేట్​ఆఫీసర్లు జిల్లాల్లో విభాగాలవారీగా ఆయా పోస్టుల ఖాళీల వివరాలతోపాటు సీనియారిటీ జాబితాలను తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి వివరాలను వచ్చినట్లు తెలిసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రూల్స్ ప్రకారం పకడ్బందీగా లిస్టులను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగుల పూర్తి వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి త్వరలోనే అందజేయబోతున్నారు. ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది ఊరట నిస్తుంది. పదోన్నతులు లభిస్తే పాలనలో మరింత పారదర్శకత, వేగం పెరగనుంది. శాఖ సైతం బలోపేతం కానుంది. ప్రభుత్వానికి సైతం మంచిపేరు రానుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Star Heroine: 52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడిన స్టార్ హీరోయిన్..ఎవరంటే..!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×