Big Stories

Keshava Rao joined Congress: కారులో కేకే కుదుపు..! కారణాలివేనా..?

- Advertisement -

Keshava Rao Left the BRS and Joined in Congress: కే కేశవరావు.. బీఆర్‌ఎస్‌ జనరల్ సెక్రటరీ.. రాజ్యసభ సభ్యుడు.. షార్ట్‌గా కేకే అని పిలుచుకునే ఈ నేత. ఇప్పుడు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు షాక్‌లు ఇస్తున్నారు. నిష్టూరంగా ఉన్నా నిజాలు ఇవేనంటూ బాంబ్‌లు పేల్చారు. ఇంతకీ కేకే చెప్పిన విషయాలేంటి? ఆయన మనోగతం వెనక రీజన్సేంటి?

- Advertisement -

అదీ సంగతి.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఖేల్‌ ఖతం. మాది థర్డ్ ప్లేసే.. పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే అని తేల్చేశారు. ఈ మాటలు చెప్తున్నది బీఆర్ఎస్‌ అంటే పడని నేతలు కాదు. సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు.. అంతరంగీకుడు. పార్టీలో అత్యంత సీనియర్‌ నేత చెప్తున్న మాటలు ఇవి.. అంటే సొంతగూటిలోనే ఆ పార్టీ పరిస్థితిపై ఉన్న క్లారిటీ ఇది. ఇది కేకే ఆక్రోశంతో చెబుతున్న మాటలు కాదు..
ఆవేదనతో పంచుకుంటున్న మనో వేదన ఇదీ అని తెలుస్తుంది..

నిజానికి ఆయనది బీఆర్ఎస్‌లో ఉన్నత పదవి.. కానీ పార్టీ నిర్ణయాల్లో ఆయన నిమిత్తమాత్రుడు.. పార్టీ అధినేత నిర్ణయాలను ప్రకటించడమే ఆయన పని.. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన ఓ ఉత్సవ విగ్రహంలా ఉన్నారు. ఇది బీఆర్ఎస్‌ భవన్‌లో కేకేపై ఉన్న టాక్.. కానీ ఇన్నాళ్లు మౌనంగా భరించిన కేకే.. ఇప్పుడు నోరు విప్పుతున్నారు. తమదే పర్మినెంట్ అధికారం అన్నట్టుగా విర్రవీగిన.. బీఆర్ఎస్‌ పెద్దలకు కర్రకాల్చి వాత పెట్టారు ప్రజలు.. మరీ ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఎలా? అంటున్నారు కేకే.. సరిగా చేయ్యరు.. చేప్తే వినరు. మరి పార్టీ బాగుంటాలంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. తాను ఎన్నికల ముందే కేసీఆర్‌ను వార్న్‌ చేశానని.. కానీ వినే ఉద్దేశం ఉండాలి కదా.. అంటూ నేరుగా పార్టీ అధినేతనే టార్గెట్ చేశారు కేకే.

Also Read: కోట్లు కుమ్మరించిన హెటిరో.. పార్ధసారథికి దక్కిన ఎంపీ సీటు

బీఆర్ఎస్‌ ప్రజల పార్టీ కాదు.. కుటుంబ పార్టీ.. ఆ కుటుంబ సభ్యులకే ప్రియారిటీ.. ఆ కుటుంబ సభ్యులు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇది ఇన్నాళ్లు ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలు.. కానీ ఇప్పుడు కేకే కూడా ఇదే చెబుతున్నారు. యస్‌.. బీఆర్ఎస్‌ కుటుంబ పార్టీనే.. ఇందులో ఎలాంటి డౌట్స్‌ లేవు.. ఇదే విషయాన్ని తాను నేరుగా కేసీఆర్‌కు కూడా చెప్పేశానన్నారు. కానీ యాస్‌జ్యువల్‌గా దాన్ని పక్కన పెట్టేశారన్నారు కేకే.

ఇదొక్కటే కాదు. కాళేశ్వరం పాపం కూడా కేసీఆర్‌దే అంటున్నారు కేకే.. అదేలా అనే కదా మీ డౌట్.. మా ఎక్స్‌ప్లేనేషన్ ఎందుకు అది కూడా మీరే వినేయండి. సో.. కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్ తన ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండాలనుకున్నాడు. తన హయాంలో నిర్మించారన్న పేరు సరిపోదనుకున్నారు. అనింట్లో వేలు పెట్టారు. తీరా ఏం జరిగింది.. మూడేళ్లకే మేడిగడ్డ మేడిపండు అని తేలింది. ఫలితం కాళేశ్వరం అప్రతిష్ట నెత్తిపై మోస్తున్నారు కేసీఆర్.. అందుకే కేకే అంటున్నారు ఎవరి పని వాళ్లు చేయాలని..

ఇవీ కేకే మాట్లాడిన విషయాలు.. కానీ కేకే ఎందుకలా మాట్లాడారు? ఇదే ఇప్పుడు అసలు క్వశ్చన్.. నిజానికి కేకే చాలా సైలెంట్‌గా ఉంటారు. మీడియాతో ఇంటరాక్షన్‌ కూడా తక్కువే..
కానీ ఇప్పుడు సీన్ మారింది. అధికారం పోయాక ఆయనలో మార్పు వచ్చింది. బీఆర్ఎస్‌ ఇప్పటికీ తన తప్పు తెలుసుకోవడం లేదని. ఆయన రగిలిపోతున్నారు.ఇప్పటికీ అవే తప్పులు చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. పార్టీ గురించి ఏ టు జెడ్ తెలిసిన ఓ సీనియర్‌ నేతే.. పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్‌ పక్కా అన్నారంటే.. బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read: ఫోన్ ట్యాపింగ్లో మళ్లీ కేసీఆర్ పేరు.. ఈసారి శిష్యుడే..!

బీఆర్‌ఎస్‌ నేతలు విక్టరీ మాదే.. కాంగ్రెస్‌ అసలు ఉనికిలోనే లేదు.. బీజేపీ అడ్రస్ గల్లంతే అంటూ మైక్‌లు పట్టుకొని.. స్పీచ్‌లు దంచుతూ.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఉన్న సీనియర్ నేతలేమో ఉన్నది ఉన్నట్టు.. కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి.. ఉన్న నేతలు కూడా కారు దిగి వెళ్లిపోతున్నారు. ఇవన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నారు కాబట్టే కేకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి చేస్తే చర్యలు తీసుకోండి. ఆ అవినీతిలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఉండొచ్చు.. నాకు పూర్తిగా తెలియదు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపించండి..
కేకే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఓ హాట్ టాపిక్.. మొత్తానికి కేసీఆర్ చేసిన ఏకచత్రాధిపత్యం.. కేవలం కల్వకుంట్ల సర్‌ నేమ్‌ ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం.. సీనియర్ నేతల సలహాలు, సూచనలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం..ఇప్పుడు పార్టీ మనుగడకే ఎసరు తెచ్చిందనడంలో ఎలాంటి డౌట్ లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News