E-Paper
Advertisement

DSP Promotions: సీఐలను డీఎస్పీలుగా బదిలీ చేస్తూ.. సీ.వీ.ఆనంద్ ఆర్డర్స్ జారీ..!

DSP Promotions: సీఐలను డీఎస్పీలుగా బదిలీ చేస్తూ.. సీ.వీ.ఆనంద్ ఆర్డర్స్ జారీ..!
Advertisement

DSP Promotions: స్వేచ్చ బ్యూరో: సుధీర్ఘకాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న 36మంది సీఐలకు సోమవారం తీపి కబురు అందింది. వారిని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ డీజీపీ సీ.వీ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పదోన్నతులు పొందిన సీఐలు డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ వారిని అభినందించారు. పదోన్నతి అన్నది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని చెప్పారు. అంతకుమించిన బాధ్యత అని అన్నారు.

నిబద్ధతతో విధులు..

సమర్థంగా విధులు నిర్వర్తించి తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.ప్రజల సమస్యలను సత్వరమే గుర్తించి, చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు. ప్రజలకు చేరువై అధికారులుగా మంచి పేరు తెచ్చుకోవాలని డీజీపీ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాల పెంపు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. డీఎస్పీ హోదాలో ప్రతి నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలన్నారు.

Advertisement

Also read: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రూ.2 వేల కోట్లు రిలీజ్.. ఆర్థికశాఖ ఉత్తర్వులు

అంకితభావంతో..

ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని తెలిపారు. ప్రజల భద్రత, సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అంకితభావంతో పనిచేస్తేనే వృత్తిపరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. పదోన్నతి పొందిన అధికారులు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ లో కాకుండా ఇతర విభాగాల్లో తమ సేవలను అందించనున్నారు. డీఎస్పీలకు పోస్టింగులు ఇదిలా ఉండగా చాలా రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 36మంది డీఎస్పీలకు డీజీపీ ఆనంద్​ పోస్టింగులు ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Also read: ‘హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది’.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్!

రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టండి.. లేదంటే ప్రజా ఉద్యమమే.. రఘునందన్ రావు వార్నింగ్!

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ బిగ్ ప్లాన్..!

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్.. తమిళనాడు మాదిరి మార్పు ఎక్కడ?

తెలంగాణలో ‘సర్’ టెన్షన్.. 21 శాతం ఓట్లు పోయే ఛాన్స్, నేతలకు సీఎం రేవంత్ కీలక సూచనలు

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు

వాళ్లు క్షుద్ర పూజలు చేశారు.. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు! కూకట్‌పల్లిలో రేవంత్ సంచలనం!

Big Stories

Advertisement
×