E-Paper
Advertisement

సావర్కర్ వివాదంలో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేసు క్లోజ్.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!

సావర్కర్ వివాదంలో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేసు క్లోజ్.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!
Advertisement

Rahul Gandhi: హిందూ సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్ ను అవమానించారంటూ రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేసింది. ఈ కేసులో చట్టపరంగా అవసరమైన ముందస్తు అనుమతిని యూపీ ప్రభుత్వం నుంచి పిటిషనర్ తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల ఇది విచారణార్హం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

అసలేం జరిగిందంటే?

2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సాగిన ‘భారత్ జోడో యాత్ర’ ర్యాలీలో సావర్కర్ ను ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఆ వ్యాఖ్యలు సావర్కర్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించేలా ఉన్నాయని ఆయన ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగమేనని ఆరోపిస్తూ న్యాయవాది నృపేంద్ర పాండే లక్నో కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థాయనం.. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఆయన ప్రసంగం ఉందంటూ రాహుల్ కు సమన్లు జారీ చేసింది.

చట్టబద్ధమైన అనుమతి లేదు: సుప్రీం

Advertisement

లక్నో కోర్టు ఇచ్చిన సమన్లను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షిల్ నాగుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. IPC సెక్షన్ 153A కింద నమోదైన ఈ కేసును విచారణకు స్వీకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. అయితే ఈ కేసులో ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తెలియజేశారు. దీంతో చట్టపరమైన అనుమతి లేని కారణంగా లక్నో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను, ఫిర్యాదును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Also Read: అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ‘వంపు’పై ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ సర్కార్!

రాహుల్‌కు సుప్రీం చురకలు!

Advertisement

అయితే స్వాతంత్ర సమరయోధులను హేళన చేయవద్దని గతంలోనే ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ కు సుప్రీంకోర్టు చురకలు అంటించింది. అనంతరం రాహుల్‌పై సాగుతున్న క్రిమినల్ చర్యలపై అప్పట్లోనే స్టే విధించింది. అంతకుముందు రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు పూర్తి ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది.

Also Read: ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

Tags

Related News

ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

ఐఐటీ బంపరాఫర్.. ఏడాదిపాటు ఏఐ కోర్సు ఉచితం.. భోజనం-స్టైఫండ్‌ కూడా

జనగణనలో మొత్తం 40 ప్రశ్నలు ఇవిగో, కులంతోపాటు బ్యాంకు అకౌంట్లు కూడా

పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!

తనకు-విద్యార్థుల మధ్య వ్యవహారం.. బార్ కౌన్సిల్ నిర్ణయంపై సీజేఐ రియాక్ట్

వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు, ఇంకా

Big Stories

Advertisement
×