E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Tanveer Ahmed: టీమిండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేశాక‌, కంటి నిండా నిద్ర‌పోయాను

Tanveer Ahmed:  టీమిండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేశాక‌, కంటి నిండా నిద్ర‌పోయాను
Advertisement

Tanveer Ahmed:  ఐర్లాండ్ చేతిలో టీమిండియా ( Team India) టి20 సిరీస్ (IND VS IreLand Series) ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇండియాలో తప్ప టీమిండియా క్రికెటర్లు విలేసి మైదానాలలో ఆడలేరని దారుణంగా విమర్శలు చేస్తున్నారు. మన మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన దిగ్గజాలు కూడా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాను కించపరుస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేసిన నేపథ్యంలో నిన్న కంటి నిండా నిద్రపోయానని బాంబు పేల్చారు. 30 మీటర్ల బౌండరీ గేటు ఉంటేనే టీమిండియా ( Team India) ప్లేయర్లు సెంచరీలు, అర్థ సెంచరీలు చేస్తారని వ్యాఖ్యానించారు. అవసరమైతే 20 ఓవర్లలో 280 పరుగులు కూడా సాధిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ ఐర్లాండ్ లాంటి విదేశీ గడ్డలపై టీమిండియా ప్లేయర్లకు ఆడడం చేతకాదని పరువు తీశారు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed). దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Womens Champions Trophy 2027 No Chance For Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

టీమిండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేశాక‌, కంటి నిండా నిద్ర‌పోయాను

Advertisement

ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేసిన నేపథ్యంలో తాను కంటి నిండా నిద్రపోయాను అంటూ బాంబు పేల్చారు. వరల్డ్ ఛాంపియన్స్ అన్న పొగరుతో ఇన్ని రోజులు టీమిండియా రెచ్చిపోయిందని… అలాంటి పొగరును ఐర్లాండ్ లాంటి పసి కూన జట్టు చిత్తుగా ఓడించిందని గుర్తు చేశారు. టీమిండియాలో A,B, C ఇలా రకరకాల జట్లు ఉన్నాయని చాలా మంది చెబుతూ ఉంటారని వెల్లడించారు.

అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్లలో ఇండియా కూడా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహం లేదని తన్వీర్ అహ్మద్ తెలిపారు. అలాంటి బలమైన జట్టు ఐర్లాండ్ ( Ireland) చేతిలో వైట్ వాష్ కావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని విమర్శలు చేశారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన ప్రధాన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఐర్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఓడిపోవడం సిగ్గుచేటు అంటూ పరువు తీశారు. అంతేకాదు ఈ టోర్నమెంట్ కంటే ముందు ఐర్లాండ్ను ఒక పిక్నిక్ టూర్ గా తీసుకున్నారని.. అందుకే టీమిండియా ఓడిపోవలసి వచ్చింది అన్నారు.  30 నుంచి 40 మీట‌ర్ల బౌండ‌రీ గేట్ ఉంటేనే టీమిండియా అద్భుతంగా రాణిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. లేక‌పోతే, ఇలాగే టీమిండియా ఓడిపోతుంద‌ని చెప్పుకొచ్చారు.  దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నారు.

Advertisement

Also Read:  Womens Champions Trophy 2027 No Chance For Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

 

 

 

 

 

Related News

టీమిండియా ప‌త‌నం మొద‌లైంది..ఇక వాళ్ల‌ను దేవుడు కూడా కాపాడ‌లేడు

టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోం

ఐర్లాండ్ సిరీస్ ను పిక్నిక్ లా ఎంజాయ్ చేశారు..ఇప్పుడు ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

అవి 24 క్యారెట్ల‌ ప్లాట్ ట్రాక్‌ లు కాదురా నాయ‌నా.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడండి

ఇక‌నైనా బుడ్డోడిని ఆడించు, లేక‌పోతే గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్

ఐపీఎల్ పిచ్ ల‌కు అల‌వాటైపోయారు..బౌన్స‌ర్లు వ‌స్తే వ‌ణికిపోతున్నారు

Big Stories

×