E-Paper
Advertisement

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు
Advertisement

TG Smart Ration Cards: ప్రజలకు మరో శుభవార్త చెప్పింది రేవంత్ ప్రభుత్వం. ఆగస్టు 15 కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. సంగారెడ్డి వేదికగా శనివారం సీఎం రేవంత్‌రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులతోపాటు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పనలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఆ కార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

Advertisement

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15వ నుంచి కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనుంది. అందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. లక్షలాది స్మార్ట్ రేషన్ కార్డులను గుర్తించారు. ఆధార్‌కు అన్ని లింకు కావడంతో నకిలీలకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా తయారు చేశారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 9 రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో రెడీ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే బ్యాంకు నోట్లు-పాస్‌పోర్టులు తయారీకి ఉపయోగించే అత్యంత భద్రత కలిగిన టెక్నాలజీని వినియోగించింది ప్రభుత్వం.

 

భద్రతకు అత్యంత ప్రాధాన్యత

Advertisement

ఇక స్మార్ట్ రేషన్ కార్డు విషయానికి వద్దాం. ఎడమవైపు సీఎం రేవంత్‌రెడ్డి.. కుడివైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోటోలు ఉండనున్నాయి. రేషన్‌ కార్డు నంబరు, కుటుంబ యజమాని పేరు, రేషన్ షాపు సంఖ్య ఒకవైపు మాత్రమే ఉంటాయి. రెండోవైపు వచ్చేసరికి గ్రామం, మండలం, జిల్లాతోపాటు రేషన్‌కార్డుదారు ఇంటి చిరునామా ఉంటుంది. అయితే కుటుంబ యజమానిగా మహిళల పేరుని ముద్రించింది ప్రభుత్వం. ఆధునిక భద్రతా ఫీచర్లు జోడించడంతో ఆ కార్డును జస్ట్ స్కాన్‌ చేయగానే లబ్ధిదారుల వివరాలు తెలిస్తాయి.

 

9 రకాల ఫీచర్లు.. నకిలీకి నో ఛాన్స్

తెలంగాణ ప్రభుత్వ అంటూ అక్షరాలతోపాటు అధికారిక చిహ్నంతోపాటు వాటర్ మార్క్ ఉంటుంది. సురక్షిత హోలోగ్రామ్, మాగ్నిఫికేషన్‌లో కనిపించే అతి చిన్న మైక్రో టెక్స్ట్ ఉంది. వీటితోపాటు జీవో టీజీ ఒరిజినల్ సూపర్ ఇంపోజ్డ్ లెటర్, ప్రభుత్వ చిహ్నం వాటర్ మార్క్, ఇన్విజిబుల్ యూవీ- UV లోగో కనిపిస్తుంది. అలాగే ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్- QR Code ఉంటుంది. అది స్కాన్ చేయగానే వివరాలు తెలుస్తాయి. నకిలీలను అడ్డుకునేందుకు గిల్లొషే సెక్యూరిటీ ప్యాటర్న్ వంటి అత్యాధునిక భద్రతా ప్రమాణాలను అందులో చేర్చారు. రేషన్ కార్డుల దుర్వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త స్మార్ట్ కార్డుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

ALSO READ: వాళ్లు క్షుద్రపూజలు చేశారు.. కానీ దేవుడు మన వైపు ఉన్నారు-సీఎం రేవంత్‌రెడ్డి

 

Related News

పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు శ్రీరాముడు, హర హర మహాదేవ్ ఎందుకనరు-సీఎం రేవంత్

తెలంగాణకు పీఎం సహకరించడం లేదు.. డెవలప్‌మెంట్ ఫైళ్లన్నీ ఆపేస్తున్నారు: సీఎం రేవంత్

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి!

ఫార్ములా-ఈ కేసులో బిగ్ అప్‌డేట్.. కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్!

లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 40 మంది, ఖమ్మం జిల్లాలో ఘటన

కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

Big Stories

Advertisement
×