E-Paper
Advertisement

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం
Advertisement

Bommarasipet Lands: శామీర్పేట మండల్ బొమ్మరాసిపేట రైతుల భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శామీర్‌పేట్‌ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.

భూ వ్యవహారంలో జోక్యం..

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ.. బొమ్మరాసిపేట రైతుల భూములను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అండతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు భూ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించాల్సి ఉంటే అధికారికంగా వివరణ ఇవ్వాలని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Also Read: iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!

రాష్ట్రంలోనే భారీ భూ కుంభకోణం

బొమ్మరాసిపేట భూముల వ్యవహారం రాష్ట్ర చరిత్రలోనే భారీ భూ కుంభకోణంగా మారుతోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి లావాదేవీలను నిలిపివేయడంతో వారు తమ భూములను విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని భూములకు సంబంధించి నకిలీ పత్రాలు, రికార్డులు సృష్టించారన్న ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. రైతులకు న్యాయం చేయాలి. భూములపై ఉన్న ఆంక్షలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. రెవెన్యూ రికార్డులు, గతంలో జరిగిన విచారణలు, అధికారుల ఆదేశాలను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళన ఉధృతం..

Advertisement

రైతుల భూములను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జాం రవి ,మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ యాదవ్, నవీన్ రెడ్డి, ఎల్లుబై, మేకల కావ్య, అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు వీరారెడ్డి వెంకటరెడ్డి కౌన్సిలర్ యూసుఫ్ బాబా,బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, బొమ్మరాసిపేట భూ బాధిత రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also read: హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!

Tags

Related News

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం: కొండా సురేఖ

ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు.. రెడ్ హిల్స్‌లో శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

నీ చేతకాని తనాన్ని పార్టీ అధినేత పై మోపుతావా.. కేటీఆర్ పై కవిత ఫైర్!

గంజాయి స్మగ్లర్ల అరాచకాలకు ఇక చెక్.. ఎక్సైజ్ పోలీసుల చేతికి ఆయుధాలు..?

కవిత చెప్పినట్లుగా హరీష్ రావు గుంటనక్కే.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు!

భారీగా తరలిరండి.. సిరిసిల్ల సీఎం సభను సక్సెస్ చేద్దాం!- మహేష్ కుమార్ గౌడ్

Big Stories

Advertisement
×