E-Paper
Advertisement

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?
Advertisement

Tata Madhu: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల తొలిరోజూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సభ పట్టుబట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు సభానాయకుడిగా డిమాండ్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సభలో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వం బర్తరఫ్ చేయాలని కోరారు. దీనికి సభలో ఉన్న బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. స్పీకర్ పై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా సభ పరిగణించింది. సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు. తాతామధు సభ్యత్వం రద్దుకు డిమాండ్ చేశారు. తొలిరోజూ మొత్తం స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సభ్యులు మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గతంలో స్పీకర్ చైర్ పై కేటీఆర్, జగదీష్ రెడ్డి తో పాటు కడియంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం ప్రస్తావించారు. చర్యలకు డిమాండ్ చేశారు. మంగళవారం సైతం స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపైనే సభ కొనసాగనున్నట్లు సమాచారం.

క్షమాపణ చెప్పాల్సిందే..

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూస్పీకర్ పైన అత్యంత హేయంగా ఎమ్మెల్సీ తాతామధువ్యాఖ్యలు చేసిన కేటీఆర్, హరీష్ రావు ఆవ్యాఖ్యలను ఇప్పటి వరకు ఖండించలేదు.. కనీసం స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ వ్యాఖ్యలపైన స్పందించదని ప్రశ్నించారు. స్పీకర్ తల్లిని దూషించేలా వ్యాఖ్యలు చేయడం ఎందుకు సమంజసం అని ప్రశ్నించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను చింతిస్తున్నామన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ కు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ డీఎన్ఏ లోనే దళిత వ్యతిరేకత ఉందన్నారు. గతంలో దళిత డీప్యూటీ సీఎంరాజయ్యను కేసీఆర్ బర్తరఫ్ చేశారు.. కడియం శ్రీహరిని సభలో అవమానించారు.. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా నిరూపించుకుంటోందన్నారు. కేసీఆర్ సభకు రావాలి.. సంఘటన పైన స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంఘటనపైన మా దళిత ఎమ్మెల్యేలు మనస్థాపం చెందారన్నారు.

14 సార్లు గెలిచిన ఏఐసీసీ..

Advertisement

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సభాపతి పై అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ప్రవర్తన పై సభలో చర్చ జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 14 సార్లు గెలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేసిన సంస్కృతి బీజేపీ ది అని దుయ్యబట్టారు. సభాపతి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీఒక దళిత స్పీకర్ ను అధ్యక్ష అని పిలిచే పరిస్థితి లేక చైర్ ను అవమానపరిచే విధంగా ఇద్దరు సభ్యులు మాట్లాడిన రికార్డ్ వెరిఫై చేసి సభ నుండి శాశ్వతంగా బయటకు పంపించాలన్నారు. ఆ ఇద్దరి సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Also read: స్మార్ట్ టీవీ మైక్ ఆన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ చెక్ చేయండి!

శుద్ధి చేసి బీజేపీ..

Advertisement

బీజేపీ ది ఫ్యూడలిస్ట్ పార్టీ..మనువాద పార్టీ అందుకే 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేల ఖర్గే.. ప్రసంగించిన ప్రదేశాన్ని శుద్ధి చేసి బీజేపీ ఇప్పుడు స్పీకర్ కి అవమానం జరిగితే కనీసం స్పందించడం లేదన్నారు. బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న స్పీకర్ కి అవమానం జరిగితే కూడా మాట్లాడ కూడా డైవర్షన్ జరుగుతుందన్నారు. నిజంగా బీజేపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే సభాపతి కి అవమానం పై చర్చ చేయండి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయండి అన్నారు. ఫ్యూడలిస్ట్ దళిత వ్యతిరేక పార్టీ..మనువాద పార్టీ..సభ సంప్రదాయాల పార్టీ వాళ్లు చర్చకు అవకాశం లేకుండా అడ్డుకుంటున్నారన్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు సభ్యుల పై చర్యలు తీసుకోవాలి.శాశ్వతంగాసస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

గొంతు నొక్కేందుకు..

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై, ఆయన మాతృమూర్తిపై అసభ్య పదజాలం ఉపయోగించిన ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏ తప్పూ చేయని, ఇప్పుడు మన మధ్య లేని ఆయన మాతృమూర్తిని అవమానించడం క్షమించరాని నేరం అన్నారు. సభ గౌరవం, హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో సభ్యులు బాధ్యతాయుతంగా, హుందాగా వ్యవహరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సస్పెన్షన్లను అస్త్రంగా ఉపయోగించిందన్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. సభకు హాజరుకాకుండా, అసెంబ్లీ సజావుగా సాగకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ.. ప్రజా సమస్యలపై చర్చించే సభకు హాజరుకాకపోవడం సరికాదన్నారు. సంస్కారం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావాలి.. లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న సభను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

ఎమ్మెల్సీ తాత మధు..

మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ కి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించడం చేతకాక, మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక, ప్రశ్నిస్తాం అని చెప్పి, గేట్ దగ్గర డ్రామాలు చేశారన్నారు. పోలీసుల మీద దౌర్జన్యం చేయడమే కాకుండా… దేవాలయం లాంటి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న ఒక దళిత బిడ్డ, సౌమ్యుడు, స్పీకర్ ని దురహంకారంతో, దుఃసంస్కారంతో ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడిన మాటలు ఇవాళ సభ్య సమాజం తల దించుకునేలాగా ఉందన్నారు. స్పీకర్ కన్నా తల్లిని కూడా… ల…కొడక అని మాట్లాడిన ఈ దుర్మార్గుడిని కేసీఆర్ వెంటనే సస్పెండ్ చేయాలి. అదే విధంగా మండలి లో తాత మధు సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాల బిడ్డ, దళిత బిడ్డ స్పీకర్ గా ఉంటే కేసీఆర్ సభకు రారు… వాళ్ల నాయకులు బయట డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లోఏ మాత్రం ఆడవారి పట్ల, దళిత జాతి పట్ల గౌరవం ఉన్న తాత మధు ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తల్లి గారిని అత్యంత అవమానీయంగా మాట్లాడడం బాధాకరం అని, ఇద్దరు సభ్యులు తాత మధు ఇంకొకరు నవీన్ మాట్లాడిన మాటలు నేను విన్నాను..వారిపై చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కోరారు. ఇది స్పష్టంగా కెసిఆర్ డైరెక్షన్ లో జరిగిందన్నారు. మంత్రి మాట్లాడుతూ కంటతడి పెట్టారు.

Also Read: అప్పుడు అవమానం.. ఇప్పుడు అభిమానం.. తెలంగాణ యాసను తవ్వి తలకెత్తుకుంటున్న టాలీవుడ్!

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..

మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ స్పీకర్‌ పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి, శాసన వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. స్పీకర్‌ పై చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించినవి కాదని, మొత్తం దళిత సమాజాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని హౌస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేయడాన్ని తాము వ్యతిరేకించబోమని.. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై అనుచిత పదజాలం ఉపయోగించడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం దళిత సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. దళితుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అన్నారు.

రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి..

స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.శాసనసభ స్పీకర్‌ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని, అది మొత్తం శాసనసభకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. అలాంటి అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిపై వ్యక్తిగత, అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.స్పీకర్‌ను అవమానించడం అంటే శాసనసభ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని, బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని సూచించారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు తావివ్వకూడదన్నారు.ప్రజాస్వామ్యంలో సభా సంప్రదాయాలు, రాజ్యాంగ విలువలు, పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇకనైనా ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

Also read: ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

Tags

Related News

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

గ్రాండ్ సక్సెస్ సాధించిన టీపీసీసీ చీఫ్.. మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణంలో నిలిచిన టాప్ ప్రోగ్రామ్స్ ఇవే!

ఫామ్‌హౌజ్‌కేదీ ప్ర‌శాంత‌త‌? కేటీఆర్ డైరెక్ష‌న్‌లో కంట్రోల్ త‌ప్పిన స‌భ్యులు..! ద‌ళిత వ్య‌తిరేక‌తను మూట‌గ‌ట్ట‌కున్న వైనం..

నోరు జారిన వైనం.. అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో అభాసుపాలు..! ద‌ళిత స్పీక‌ర్‌పై ఇదేం వైఖ‌రి? చ‌ర్య‌ల‌కు డిమాండ్..

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

కేసీఆర్ క్లాస్‌.. కేటీఆర్ మాస్‌! చ‌ర్చ‌ల వ్యూహం ఆయ‌న‌ది.. ర‌చ్చ చేసి ఫోక‌స్ త‌మ‌పై నిలిపే ఎత్తుగ‌డ ఈయ‌న‌ది..!

Big Stories

Advertisement
×