BigTV English

Telangana Polls : పాలేరు సభలో తుమ్మలపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

పాలేరు స‌భ‌లో కాంగ్రెస్ నేత, బీఆర్‌ఎస్ మాజీ నాయకుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో తుమ్మ‌ల ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే.. పిలిచి ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశార‌ని తుమ్మ‌ల‌పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు

Telangana Polls : పాలేరు సభలో తుమ్మలపై నిప్పులు చెరిగిన సీఎం  కేసీఆర్
CM KCR paleru meeting

CM KCR paleru meeting(political news in telangana):

పాలేరు స‌భ‌లో కాంగ్రెస్ నేత, బీఆర్‌ఎస్ మాజీ నాయకుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో తుమ్మ‌ల ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే.. పిలిచి ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశార‌ని తుమ్మ‌ల‌పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.


బీఆర్ఎస్ కు తుమ్మల నాగేశ్వరరావు అన్యాయం చేశారా… తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కు అన్యాయం చేశారో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణిస్తే జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకున్నామన్నారు. ఐదేళ్ల పాటు ఖమ్మం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లు తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తే గుండు సున్నా ఇచ్చారన్నారు.

తనకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పూటకో పార్టీ మారే వాళ్లను నమ్మి ఓటు వేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మి ఓటు వేయవద్దని ఆయన సూచించారు.


అలాగే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వలస వెళ్లిన మరో నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కూడా సీఎం కేసీఆర్‌ టార్గెట్ చేశారు. పొంగులేటి పేరును ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్‌ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబ్బు మదంతో ప్రజాస్వామ్యానే కొంటామని అంటున్నారని కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్లకు డబ్బు అహంకారం. డబ్బుతో మేం ఎవరినైనా కొనుగోలు చేయగలం. ఏదైనా చేయగలం అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఆ నాయకులు ఎవరు?.. వాళ్లు పాలేరులో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు.’ అని పొంగులేటిపై పరోక్షంగా టార్గెట్ చేశారు.

డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వారికి అవకాశం ఇవ్వవద్దని కేసీఆర్ కోరారు. పదవుల కోసం పార్టీలు మారే వారు మన మధ్యలోనే ఉన్నారని చెప్పారు. డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనుకునే వారికి బుద్ది చెప్పాలని కేసీఆర్ కోరారు.

ప్రజలకు మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా గతంలో పాలించిన పార్టీలకు లేదన్నారు. గతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. భక్త రామదాసు ప్రాజెక్టుతో ఎకరం రూ. 4 లక్షలున్న భూమి ధర ఇవాళ రూ. 40 లక్షలకు పెరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీల వైఖరిని పరిశీలించి ఓట్లు వేయాలని ఆయన ప్రజలను కోరారు.

మొదట రైతు బంధు 4 వేలుతో స్టార్ట్ చేసాము.. ఇపుడు రూ. 5 వేలు చేసాము.. ఎలక్షన్ తర్వాత పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ. 5 వేలకు తీసుకుపోతాము. ఒకపుడు విత్తనాలు, ఎరువుల కోసం రైతులు వేచి చూసేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేదన్నారు. వందకు వంద శాతం రైతు బంధు కొనసాగిస్తాం. మహిళకు ఖచ్చితంగా నెలకు రూ. 3 వేలు అందిస్తాం. రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామన్నారు. రైతు బీమా.. తరహాలో కేసీఆర్ బీమాను అమలు చేస్తామన్నారు. సిలిండర్ కూడా రూ. 400 కే ఇస్తామన్నారు.

రైతు బంధు, కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా? అని కేసీఆర్ ఘాటుగానే ప్రశ్నించారు. రైతు బంధు సొమ్ముతో రైతులకు పెట్టుబడి కష్టం తీరింది. రైతు చనిపోతే వాళ్ల కుటుంబానికి రైతు బంధుతో రూ. 5లక్షల బీమా అందజేస్తున్నామని చెప్పారు. రైతు బంధు వద్దనే వాళ్లకు ఓటుతో బుద్ది చెప్పాలని అన్నారు.

24 ఏళ్ల క్రితం పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినట్టుగా ఆయన చెప్పారు. అప్పుడు చాలా మంది అవమానించారన్నారు. కాంగ్రెస్ మోసం చేస్తే కేసీఆర్ శవయాత్రనా, జైత్రయాత్రనా అని దీక్ష మొదలు పెట్టినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు. తాను దీక్ష చేస్తే అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో తనను అనేక మంది అవమానించారన్నారు.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×