
Driving Rules : బీజింగ్‌లో రోడ్డు దాటేవారు.. సిగ్నల్స్ పడే వరకు ఆగాలి. అయితే.. రోడ్డు మీద వాహనాలు లేవులే.. అని రోడ్డు దాటాలని ఎవరైనా ప్రయత్నించి, ఆ టైమ్‌లో అనుకోకుండా వేగంగా ఏదైనా వాహనం వస్తే.. ఆ వాహనం డ్రైవర్ వాహనాన్ని ఆపడు. అలా ఆపితే.. ఫైన్ తప్పదు. ఈ ప్రాణాంతక నియమంతోనైనా జనం రోడ్ సేఫ్టీ పాటిస్తారని ప్రభుత్వం నమ్మకమట.
జపాన్‌లో కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుమీద పోతున్నప్పుడు.. రోడ్డు మీది మురికినీరు, బురద ఆ రోడ్డుమీద నడిచే పాదచారుల మీద పడితే డ్రైవ్ చేసేవారు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
రష్యాలో మీ కారు రోడ్డెక్కాలంటే.. ముందు దాన్ని శుభ్రంగా తుడవాలి. మురికిమురికిగా ఉన్న కార్లతో రోడ్డుమీదకి వచ్చారో.. 2,000 రూబుల్స్(రూ. 3,400) ఫైన్ తప్పదు.
జార్జియాలోని మెరియట్టా అనే నగరంలో కార్లు లేదా బైకులలో వెళ్లే వారు రోడ్డు మీద ఉమ్మివేయకూడదు. అలా చేసే ఫైన్ తప్పదు. అయితే.. ట్రక్ డ్రైవింగ్ చేసేవారు మాత్రం ఎక్కడైనా ఉమ్మివేయవచ్చు.
స్వీడెన్‌లో కార్ల లైట్లు ఎప్పుడూ వెలుగుతూ ఉండాల్సిందే. చివరకు పార్క్ చేసినా సరే. పొరబాటున లైట్లు వెలగకుండా కారు కనిపిస్తే.. ఆ కారుకు ఫైన్ తప్పదు.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నడుముకిందికి ఉండే ట్రౌజర్లు, చెడ్డీలతో ధరించి కార్లను కడగకూడదనే నియమం ఉంది. కాదని బహిరంగ ప్రదేశాల్లో కడిగితే.. భారీ జరిమానాలు కట్టాల్సిరావొచ్చు.
కోస్టారికా మద్యం త్రాగుతూ వాహనం నడపొచ్చు. కానీ.. పోలీసులు పరీక్షించినప్పుడు రక్తంలో 0.75 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉంటే మాత్రం ఫైన్ కట్టాలి.
ఇటలీలోని ఎబోలి అనే నగరంలో రన్నింగ్ కారులో ఎవరైనా ముద్దు పెట్టుకోవటం పోలీసులు చూస్తే.. వారినుంచి 415 .యూరోల జరిమానా వసూలు చేస్తారు.
ఆదివారాల్లో కార్లు కడిగారో అంతే సంగతులు స్విట్జర్లాండ్ దేశంలో ఆదివారాలలో కార్లను కడగకూడదు. అలా కడగటం పోలీసులు చూశారో.. అక్కడికక్కడే జరిమానా కట్టాలి.
థాయ్‌లాండ్ దేశంలో నడుము పైభాగంలో బట్టలు లేకుండా కార్లు, బైకులు, ట్యాక్సీలలో ప్రయాణించటం నేరం. పోలీసుల దృష్టికి వస్తే ఫైన్ తప్పదు.
Pawan Kalyan Vs RGV: వాలంటీర్లపై పవన్ సంచలన ఆరోపణలు.. వర్మ కౌంటర్..