BigTV English

Telangana Rains: సీఎం అత్యవసర రివ్యూ.. అధికారులు సెలవులు పెట్టొద్దు

Telangana Rains: సీఎం అత్యవసర రివ్యూ.. అధికారులు సెలవులు పెట్టొద్దు

Telangana Rains CM Emergency Review: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు.


జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా సెలవులు పెట్టిన సమక్షంలో వెంటనే వాటిని రద్దు చేసుకొని పనుల్లో నిమగ్నం కావాలని చెప్పారు.

అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావొద్దని సీఎం రేవంత్ సూచించారు. అలాగే సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర నర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్‌లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు.


లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలి ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం చెప్పారు.

Also Read: భారీ వర్షాలతో నిండిపోయిన రిజర్వాయర్లు.. పలు రైళ్లు రద్దు

రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. నగరాల్లో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటమునిగాయి. గ్రామాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. రైతులు, కూలీలు ఇంటికే పరిమితమయ్యారు.

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×