E-Paper
Advertisement

ఆర్టీసీ సమ్మె విరమణ.. ఉదయం నుంచే రోడ్డెక్కనున్న బస్సులు!

ఆర్టీసీ సమ్మె విరమణ.. ఉదయం నుంచే రోడ్డెక్కనున్న బస్సులు!
Advertisement

TGSRTC strike called off: తెలంగాణలో గత మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల సబ్‌కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో, సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.

సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించాయని అభినందించారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విలీన ప్రక్రియలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను త్వరలోనే తొలగిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం నుంచే అన్ని డిపోల పరిధిలో బస్సు సర్వీసులు పునరుద్ధరించబడతాయి.

Advertisement

ఈ చర్చల్లో ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కొత్త వేతన సవరణ (PRC) అమలు, ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమ్మె విరమణతో శనివారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు యథావిధిగా రోడ్డెక్కనున్నాయి. గత మూడు రోజులుగా రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రయాణికులకు, ముఖ్యంగా దూరప్రాంత ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.

Read Also: ఆర్టీసీ జేఏసీతో మంత్రుల కమిటీ భేటీ.. 29 డిమాండ్లకు సర్కార్ పచ్చజెండా.. ఆ మూడు డిమాండ్ల‌పై కీల‌క చ‌ర్చ‌

Related News

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×