E-Paper
Advertisement

Gram Panchayat Elections: తెలంగాణలో మోగిన పంచాయతీ నగారా? ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన!

Gram Panchayat Elections: తెలంగాణలో మోగిన పంచాయతీ నగారా? ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన!
Advertisement

Gram Panchayat Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల వారీగా ఉన్న ఫోటో ఓటర్ల జాబితాలను (Photo Voter Lists) పునఃపరిశీలించి, తిరిగి ప్రచురించాలని అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో వార్డుల వారీగా జరిగిన ‘మిస్ మ్యాపింగ్’  దోషాలను సరిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారులకు (DPO) స్పష్టమైన సూచనలు చేసింది.

ఈ సవరణ ప్రక్రియకు సంబంధించి కమిషన్ ఒక అత్యవసర షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, నవంబర్ 20వ తేదీ నుంచి ఓటర్ల జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన అభ్యంతరాలను నవంబర్ 22వ తేదీ నాటికి అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. సవరణల అనంతరం రూపొందించిన తుది ఫోటో ఓటర్ల జాబితాలను మరియు పోలింగ్ స్టేషన్ల వివరాలను నవంబర్ 23న తిరిగి ప్రచురించాలి.

Advertisement

అదే రోజు (నవంబర్ 23) తుది జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు ఎంపీడీవోలు (MPDOs), ఏడీఈఏలు (ADEAs) తక్షణ చర్యలు చేపట్టాలని ఈసీ సూచించింది. ఈ జాబితాల సమర్పణతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

Read Also: Bandi Sanjay: అలా జరిగితే నా శ్వాస ఆగిపోయినట్లే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×