E-Paper
Advertisement

CEO Vikasraj: నాగార్జున సాగర్ నీటి విడుదల వివాదం.. నేతలకు సీఈఓ వికాస్ రాజ్ విజ్ఞప్తి

CEO Vikasraj: నాగార్జున సాగర్ నీటి విడుదల వివాదం.. నేతలకు సీఈఓ వికాస్ రాజ్ విజ్ఞప్తి
Advertisement
CEO Vikasraj

CEO Vikasraj: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల పై ఏపీ పోలీసులు బుధవారం అర్థరాత్రి హంగామా చేశారు. 13వ గేటు వరకూ తమ పరిధిలోకి వస్తుందంటూ ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఉండగా.. వాటిలో 13వ గేట్ వరకూ తమ పరిధిలోకి వస్తుందంటూ.. ఏపీ పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డుకున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి మొబైల్ ఫోన్లను, డ్యామ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్ వద్దకు చేరుకుని ముళ్లకంచెను ఏర్పాటు చేసి.. డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ పైకి చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నీటి నిర్వహణ విషయం నీటిపారుదల శాఖకు సంబంధించిందని, వెంటనే ముళ్లకంచెను తొలగించాలని ఏపీ పోలీసులకు సూచించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో ఆయన సిబ్బందితో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ అంశంపై సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం గురించి పోలీసులే చూసుకుంటారని, రాజకీయనేతలు తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. నేతలెవరూ ఎలక్షన్ నిబంధనలను అతిక్రమించొద్దని విజ్ఞప్తి చేశారు. సనత్ నగర్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×