E-Paper
Advertisement

Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం

Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం
Advertisement

Telangana Economy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం రాబోయే రెండు దశాబ్దాలలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్ – విజన్ 2047” బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు సోషియో ఎకానమీ – 2026 సోషియో సర్వేలో బ్రిఫింగ్ చేసింది.​ 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది జాతీయ వృద్ధి రేటు (8.శాతం) కంటే గణనీయంగా ఎక్కువగా స్పష్టం చేశారు. 2025-26 అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్ డీపీ దాదాపు రూ. 17.82 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931 కి చేరింది. జాతీయ సగటు రూ. 2,19,575 తో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం.

రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీలో..

ఇక రాష్ట్ర అభివృద్ధిని సమతుల్యం చేయడానికి తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా విభజించినట్లు పొందుపరిచారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే ఈ ప్రాంతం లో కేవలం సేవా రంగం నెట్-జీరో మెట్రోపాలిటన్‌గా ఉంటుంది. పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీలో రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ఈ జోన్ తయారీ రంగానికి కేటాయించనున్నారు. రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీలో వ్యవసాయం, గ్రీన్ ఎకానమీ , అగ్రి-ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సేవా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 68.6 శాతం వాటాతో రూ. 11,30,596 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఐటీ ఎగుమతులు 16.6 శాతం వృద్ధితో రూ.3.13 లక్షల కోట్లకు చేరాయి.ఇక పారిశ్రామిక రంగంలో 18.5 శాతం వాటాతో 8.1 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా తయారీ , నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Advertisement

Also Read: Historical Movie OTT : సముద్రంలో కుప్పలు తెప్పలుగా తేలియాడే శవాలు… ఒళ్ళు గగుర్పొడిచే వార్ డ్రామా

భారత్ ఫ్యూచర్ సిటీ..

వ్యవసాయ రంగంలో 1.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో 10.1% (రూ. 26,684 కోట్లు) వ్యవసాయ రంగానికి కేటాయించడం గమనార్హం. మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రధాన్యత ఇస్తన్నట్లు వెల్లడించారు. విద్యను మాస్ యాక్సెస్’ నుండి ‘మాస్ ఎక్సలెన్స్’ దిశగా మార్చనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య రంగంపై ఖర్చును జీఎస్ డీపీలో 8 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అంతేగాక ముచర్లలో 30,000 ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి చేస్తున్నారు. ఇది నెట్-జీరో స్మార్ట్ సిటీగా, ఏఐ సిటీ, ఎడ్యుకేషన్ హబ్‌గా ఉండబోతోంది. ప్రభుత్వం తీసుకున్న క్యూర్, ప్యూర్, రేర్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు పునాదులు పడతాయని సోషియో ఎకానమీ సర్వేలో వెల్లడించారు.

Advertisement

Also Read: Sabudana health risks: సగ్గుబియ్యం తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలుసా?

Related News

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×