Eatha Pallu Benefits: వేసవికాలం వచ్చేసింది. కొన్ని రకాల పండ్లు వేసవిలో మాత్రమే లభిస్తాయి.. వాటిలో ఈత పండ్లు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లో పిల్లలు, పెద్దలు ఈత పండ్ల రుచిని ఆస్వాదిస్తారు. ఈత పండ్లు తినడానికి తియ్యగా.. రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ కాలంలో పిల్లలు ఈత పండ్ల కోసం తీరుగుతుంటారు. ఇదంతా బాల్యంలో మధుర జ్ఞాపకాలు.. ఈ ఈతచెట్టు ఆరకేసి కుటుంబానికి చెందినది.
ఈత పండ్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్ , విటమిన్ సి, డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో వీటిని తినడం వల్ల అమిత శక్తిని ఇస్తాయి. దీనిలోని విలువైన పోషకాలు మనకు ఎంత డబ్బు పెట్టిన కొనలేం.. ఇవి ప్రకృతి సహజసిద్ధంగా.. ఎటువంటి మందులు కొట్టకుండా స్వచ్ఛమైన పోషకాలను మనకు అందిస్తుంది.
ఈ పండ్లు పిల్లల ఎదుగుదలలో ఎత్తు పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా వారి బ్రెయిన్ డెవలప్ మెంట్‌లో, ఎముకల ఎదుగుదలలో ఎంతో దోహదపడతాయి. ఈ సీజన్‌లో మీ పిల్లలకు వీటిని తినిపించడం వల్ల జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది. మెంటల్‌గా, స్ట్రాంగ్‌గా అవుతారు. క్షణిక ఆవేశాలు తగ్గుతాయి. ఈతపండ్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
ఈతపండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తవృద్ధికి సహాయపడుతుంది. అలాగే వేసవిలో వీటిని తినడం వల్ల శరీర వేడిని తగ్గిస్తుంది. ఈతపండ్లు తినడం వల్ల నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈరోజుల్లో కంప్యూటర్ల ముందు కూర్చని చేసే ఉద్యోగాలతో అందరు అధిక ఒత్తిడికి గురై మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు ఈ సీజన్‌లో వీటిని తినడం వల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా చేస్తుంది. ఇవి మానసిక ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఒత్తిడితో బాధపడుతున్నవారు ఈతపండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.
ఈత పండ్లను తినడం వల్ల మన కీడ్నిలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చదువుకునే పిల్లలు ఈత పండ్లను తినడం వల్ల వారి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు వారి బ్రెయిన్‌ను షార్ప్‌గా చేస్తుంది. ఇవి గుండెకు బలాన్ని ఇస్తాయి. గుండెకు ఎలాంటి జబ్బులు రాకుండా ఎల్లవేళల కాపాడతాయి. వీటిని ఈ సీజన్‌లో తినడం వల్ల పొట్ట సమస్యలు తగ్గిపోతాయిని చెబుతున్నారు. తరచు జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడుతున్నా వారికి ఇది మంచి ఉపశమనం కలిపిస్తుంది.
Also Read: డ్రాగన్ ఫ్రూట్‌తో స్టన్ అయ్యే ‘పవర్’..
ఈతపండ్లలోని కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా చేస్తాయి. వయసు పైబడిన వారు ఈ సీజన్‌లో వీటిని తినడం వల్ల ఎముకలు పెళుసుబారడం పోయి గట్టిగా మారుతాయి. అంతేకాకుండా వీటిని తినడం వల్ల నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దంతాలు చిగుళ్లు గట్టిగా ఉండేలా చేస్తాయి.
అలాగే చాలా మంది పిల్లలకు సాయంత్రం కాగానే జంగ్ ఫుడ్ పెడుతుంటారు.. వాటికి బదులుగా ఇలాంటి ఆరోగ్యకరమైన పండ్లను పెట్టడం వల్ల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లలకు జంగ్ ఫుడ్ పెట్టడం మానేసి ఇలాంటి వాటి గురించి తెలియజేసి పెట్టడం వల్ల వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది.