BigTV English

Harish Rao – KCR: కేసీఆర్ ఇక సభకు రానట్లేనా.. సంతాప తీర్మానానికి డుమ్మా.. బీఆర్ఎస్‌లో అసంతృప్తి?

Harish Rao – KCR: కేసీఆర్ ఇక సభకు రానట్లేనా.. సంతాప తీర్మానానికి డుమ్మా.. బీఆర్ఎస్‌లో అసంతృప్తి?

కేసీఆర్ ఇక రానట్లేనా?


⦿ హరీశ్ ప్రస్తావించిన ‘గౌరవం’ కామెంట్ దేనికి సంకేతం?
⦿ ఈ కామెంట్‌తో కేసీఆర్ ‘సభకు ఇక రారు’ అని చెప్పకనే చెప్పారా?
⦿ ‘సభ గౌరవం ఇవ్వడం లేదు’ అనే ప్రస్తావన వెనుక మర్మం ఇదేనా?
⦿ మన్మోహన్ సింగ్‌ను కొనియాడుతూనే గైర్హాజరు ఎందుకు?
⦿ సంతాపానికి, గౌరవానికి సంబంధమేంటనే చర్చ
⦿ ఆయన కేబినెట్‌లో పనిచేసిన కేసీఆర్‌కున్న చిత్తశుద్ధి ఇదేనా?
⦿ సంతాప తీర్మానానికి డుమ్మా కొట్టడంపై బీఆర్ఎస్‌లో అసంతృప్తి
⦿ వెళ్ళకపోవడం ద్వారా రాజకీయంగా నష్టమనే అభిప్రాయాలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Harish Rao – KCR: దివంతగ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంతాపం తెలియజేసే అంశానికి పరిమితమై ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినా కేసీఆర్ గైర్హాజరు కావడం రాజకీయ చర్చకు దారి తీసింది. విమర్శలు, ప్రతివిమర్శలకు తావు లేని తీరులో జరిగిన ఈ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలోనే హాట్ టాపిక్ అయింది. మన్మోహన్‌ సింగ్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు ఆయన హయాంలోనే తెలంగాణ ఏర్పడినా ఇప్పుడు సంతాప తీర్మానంపై జరిగే చర్చలో ఆయన పాలుపంచుకోకపోవడంతో కేసీఆర్ చిత్తశుద్ధి ఇదేనా అనే ప్రశ్నలూ ఉత్పన్నమయ్యాయి.


అయితే, కేసీఆర్‌కు ఈ సభ ఏం గౌరవం ఇచ్చిందా అంటూ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కామెంట్ చేయడం వెనుక ‘కేసీఆర్ ఇక సభకు ఎప్పటికీ రారు’ అనే సంకేతాన్ని ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ మరణవార్త తెలిసిన వెంటనే సంతాప సందేశంలో ఆయన కృషిని కొనియాడిన కేసీఆర్, జరిగిన అంత్యక్రియలకు హాజరు కాకుండా కేటీఆర్‌ను పంపడం, కనీసం అసెంబ్లీలో జరిగే చర్చకైనా ఆయన హాజరు కాకపోవడం, ఈ సభ ఏం గౌరవం ఇచ్చిందంటూ హరీశ్‌ రావు కామెంట్ చేయడం, వీటన్నింటితో కేసీఆర్ ఈ సభకు హాజరయ్యే ఉద్దేశం లేదనే అంశాన్ని పరోక్షంగా చెప్పినట్లయిందనే మాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తున్నాయి. సభకు హాజరై ఉండి ఉంటే బాగుండేదని, అలా హాజరు కాకపోవడం ద్వారా విమర్శలకు తావు ఇచ్చినట్లయిందని, రాజకీయంగా బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మధ్యే జరుగుతున్నాయి.

హరీశ్‌ రావు ఏమన్నారంటే?
మన్మోహన్‌ సింగ్ సంతాప తీర్మానంపై చర్చలో భాగంగా కేసీఆర్ గురించి హరీశ్‌ రావు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని నిర్దిష్ట అంశానికే పరిమితం కావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ వివరణ ఇస్తూ సంతాప తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనాల్సిందిగా స్వయంగా తానే కేసీఆర్‌కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశానని అని సభకు తెలియజేశారు.

దీనికి హరీశ్‌ రావు స్పందించి “ఆ విషయంలో మేం కూడా చాలా మాట్లాడాల్సి వస్తుంది.. ఈ సభ కేసీఆర్‌కు ఏం గౌరవం ఇచ్చింది? సభలో కేసీఆర్ మాట్లాడాలనే అనుకుంటున్నారు కానీ ఈ సభ ఒక సభ లాగా నడుస్తలేదు. పీఏసీ (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ) చైర్మన్ నియామకం విషయంలో ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌కు గౌరవం ఇచ్చి ఆయనను అడిగి నిర్ణయం తీసుకున్నారా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విషయంలో కేసీఆర్‌ను అడిగి నిర్ణయం తీసుకున్నారా?” అంటూ కామెంట్ చేశారు.

రాజకీయంగా వాడుకునే తపన
మన్మోహన్‌ సింగ్‌కు సంతాపం తెలియజేసే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర గురించి ఎక్కువగా ప్రస్తావించడాన్ని ఇతర పార్టీల సభ్యులూ గమనించారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నాన్చివేత ధోరణి అవలంబించిందని, ఆలస్యం అవుతుండడంతో కేసీఆర్ ఒత్తిడి చేశారని, రాజీనామాలు కూడా చేయాల్సి వచ్చిందని, లాంటి మాటలతో బీఆర్ఎస్ ఈ సమావేశాలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసిందనే అభిప్రాయమూ కొద్దిమంది ఎమ్మెల్యేలలో వ్యక్తమైంది. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో

మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఢిల్లీలో జరిగిన అంత్యక్రియలకు వెళ్ళకపోగా కనీసం అసెంబ్లీలోనైనా చర్చలో పాల్గొనకపోవడం వివాదాస్పదమైంది. మన్మోహన్‌ సింగ్‌తో కేసీఆర్‌కు ఉన్న అనుబంధం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ పట్ల ఆయనకు ఉన్న కృతజ్ఞత. చిత్తశుద్ధి ఇదేనా అనే మాటలూ గులాబీ ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సభకు గైర్హాజరు కావడం బాధ్యతా రాహిత్యమే కాక నిర్లక్ష్యం కూడా అనే గుసగుసలూ ఆ పార్టీ నేతల నుంచే వినిపించాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, వేలెత్తి చూపడం లాంటివి సంతాప తీర్మానాలపై జరిగే చర్చ సందర్భంగా ఉండవని తెలిసినా ఎందుకు రాలేదనేది కీలకంగా మారింది.

హరీశ్ ‘గౌరవం’ మాటల్లోని అంతరార్థమేంటి?
ఎమ్మెల్యే హరీశ్‌ రావు చేసిన కామెంట్లలోని ‘గౌరవం’ అనే పదానికి అర్థమేంటి అనే చర్చ మొదలైంది. గౌరవం లేనందుకే సభకు రాలేదు అని సమర్ధించుకోవడంతో ఇకపైన ఎప్పటికీ సభకు కేసీఆర్ హాజరయ్యే ఉద్దేశం లేదా? ఈ విషయాన్ని హరీశ్‌ రావు తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెప్పారా? హఠాత్తుగా ఈ టాపిక్‌ను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? సంతాపం తెలియజేయడానికి గౌరవానికి ఉన్న సంబంధమేంటి? తెలంగాణ వచ్చిన మన్మోహన్‌ సింగ్ హయాంలోనే అని చెప్తూనే సంతాప తీర్మానంపై చర్చలో ఎందుకు పాల్గొనలేదు? సీనియర్ సభ్యుడు, మాజీ సీఎం మాత్రమే కాకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానూ ఉండి గైర్హాజరు కావడంలోని ఆంతర్యమేంటి?.. ఇలాంటివన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చర్చించుకుంటున్నారు.

Also Read: CM Revanth – CM Chandrababu: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే!

సభకు హాజరవుతానంటూ కొద్దిమంది సీనియర్ ఎమ్మెల్యేలకు పరోక్షంగా కేసీఆర్ సంకేతం ఇవ్వడంతో కచ్చితంగా వస్తారనే అభిప్రాయంతో ఉన్నారు. హాజరుకాకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని, విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని, రాకపోవడం తప్పవుతుందని లాంటి మాటలూ వినిపించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య జరిగిన అంతర్గత చర్చలు వారికి కేసీఆర్ వ్యవహారశైలిపై ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా మారాయి.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×